Begin typing your search above and press return to search.
ఘోర ఓటమి తర్వాత కమల్ హాసన్ లో కీలక మార్పు
By: Tupaki Desk | 27 Jun 2021 10:30 AM GMTతమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత నటుడు, మక్కల్ నీది మయ్యం పార్టీ అధినేత కమల్ హాసన్ మళ్లీ యాక్టివ్ అయిపోయారు. తన భవిష్యత్ ప్రణాళికలపై తర్జన భర్జనలు పడుతున్నారు. ఎన్నికల్లో డబ్బులు పంచకుండా.. నీతిగా నిజాయితీ పాలిటిక్స్ అంటూ వెళ్లిన కమల్ కు ఘోర ఓటమి ఎదురైంది. పారదర్శక పార్టీగా మాత్రం కమల్ ఘనత పొందారు. ఇప్పుడు కమల్ ఈ గుణపాఠంతో తన పార్టీలో కొన్ని కీలక మార్పులను చేస్తున్నట్టు తెలుస్తోంది. కొత్త పాత్రను పోషించబోతున్నట్టుగా తెలుస్తోంది.
కమల్ హాసన్ తాజాగా ఇద్దరు కీలక రాజకీయ సలహాదారులను, ఇద్దరు ఉపాధ్యక్షులను, ముగ్గురు రాష్ట్ర కార్యదర్శులను, అదనపు కేంద్ర పాలకమండలి సభ్యుడిని, నార్పానీ ఇయక్కం వింగ్ సమన్వయకర్తను నియమించాడు. రాజకీయ సలహాదారుగా పాల కరుప్పయ్య, పొన్రాజ్ వెల్దైస్వామిలను నియమించారు.
కమల్ కు రాజకీయ అనుభవంత క్కువ. ఈ క్రమంలోనే ఈ కీలక వ్యక్తులను సలహాదారులుగా పెట్టుకున్నట్టు తెలుస్తోంది. వీరే ముఖ్యమైన సూచనలు, ప్రణాళికలు, వ్యూహాలు రూపొందించే బాధ్యతను కమల్ అప్పగించినట్టు సమాచారం. వెల్దైస్వామి పార్టీలో కీరోల్ గా మారుతాడని కమల్ అభిప్రాయపడ్డారు.
త్వరలోనే మరిన్ని నియామకాలు, పార్టీ ప్రక్షాళన చేపడుతానని కమల్ హాసన్ తెలిపారు. మొత్తం మీద కమల్ హాసన్ చేతులు కాలాక ఇప్పుడు పార్టీని చక్కదిద్దే పనిలో నిమగ్నమయ్యారు. దశల వారీగా పార్టీని నిర్మించేలా చూస్తున్నారు.
పోయిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో కమల్ హాసన్ కోయంబత్తూర్ సౌత్ నుంచి పోటీచేశారు. బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షుడు వనాతి శ్రీనివాస్ చేతిలో ఓడిపోయారు. దీంతో అసెంబ్లీలో అడుగుపెట్టాలన్న కమల్ కోరిక తీరకుండాపోయింది.