Begin typing your search above and press return to search.

మళ్లీ స్వీడన్‌ పీఠంపై ఆండర్సన్‌..స్వీడన్ రాజకీయాల్లో కీలక మార్పు !

By:  Tupaki Desk   |   30 Nov 2021 8:00 PM IST
మళ్లీ స్వీడన్‌ పీఠంపై ఆండర్సన్‌..స్వీడన్ రాజకీయాల్లో కీలక మార్పు !
X
స్వీడన్‌ ప్రధాని పీఠంపై మహిళా నేత మాగ్డలీనా ఆండర్సన్‌ వారం రోజుల వ్యవధిలోనే మళ్లీ కూర్చున్నారు. కూటమి ప్రభుత్వంలోని పార్టీ మద్దతు ఉపసంహరిం చడంతో గత వారం పదవికి రాజీనామా చేసిన ఆమె సోమవారం మళ్లీ ప్రధానిగా ఎన్నికయ్యారు. 349 సీట్లు ఉన్న స్వీడన్‌ పార్లమెంట్‌లో ప్రధాని పదవికి జరిగిన ఓటింగ్‌లో ఈమెకు మద్దతుగా 101 ఓట్లు పడ్డాయి. 75 మంది గైర్హాజరయ్యారు. స్వీడన్‌ రాజ్యాంగం ప్రకారం ప్రధానిగా ఎన్నుకోబడే వ్యక్తిని ఓటింగ్‌లో 175కు మించి సభ్యులు వ్యతిరేకించకూడదు.

అంటే వ్యతిరేకంగా 175 ఓట్లు పడితే ఆ ప్రభుత్వం కొలువుతీరదు. అదృష్టవశాత్తు ఆండర్సన్‌కు వ్యతిరేకంగా 173 ఓట్లే పడ్డాయి. దీంతో మైనారిటీలో ఉన్నా సరే సోషల్‌ డెమొక్రటిక్‌ పార్టీ సారథ్యంలో ప్రభుత్వం ఏర్పాటైంది. గత వారం గ్రీన్‌ పార్టీతో సోషల్‌ డెమొక్రటిక్‌ పార్టీ సంకీర్ణ ప్రభుత్వాన్నిఏర్పాటుచేసింది. దేశ తొలి మహిళా ప్రధానిగా ఆండర్సన్‌ బాధ్యతలు చేపట్టి చరిత్ర సృష్టించారు. అంతకుముందే ఆర్థికమంత్రిగా ఉన్న ఆమె అదే హోదాలో బడ్జెట్‌ను వెంటనే ప్రవేశపెట్టారు. ఆ బడ్జెట్‌ ప్రతిపాదనలు విపక్ష స్వీడన్‌ డెమొక్రాట్స్‌ పార్టీ విధానాలకు అనుకూలంగా ఉన్నాయంటూ కూటమి ప్రభుత్వం నుంచి గ్రీన్‌ పార్టీ వైదొలగింది. దీంతో ఆరోజు కేవలం ప్రధాని అయిన ఏడు గంటలకే ఆండర్సన్‌ రాజీనామా చేయాల్సి వచ్చింది.

సోమవారం జరిగిన కొత్త ఓటులో సోషల్ డెమోక్రటిక్ పార్టీ నాయకురాలు మాగ్డలీనా అండర్సన్‌కు ఎంపీలు స్వల్ప తేడాతో మద్దతు పలికారు. దీంతో మరోసారి ఆమె స్వీడన్ ప్రధాన మంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టారు. వచ్చే ఏడాది సెప్టెంబర్‌లో జరిగే ఎన్నికల వరకు ఆమె ఏకపక్ష ప్రభుత్వాన్ని నడిపించేందుకు మార్గం సుగమమం అయ్యింది. ఆండర్సన్ పార్లమెంట్‌లో ఒక్క ఓటుతో స్వీడన్ మొదటి మహిళా ప్రధాన మంత్రిగా ఎన్నికయ్యారు. 54 ఏళ్ల ఆర్థికవేత్త అయితన ఆండర్సన్ గ్రీన్ పార్టీతో కలిసి కొత్త సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అయితే, ఆమె బడ్జెట్ ప్రతిపాదనను ఆమోదించడంలో విఫలమైన సందర్భంగా గందరగోళంలో పడింది.

స్వీడన్ డెమొక్రాట్‌ లతో సహా ప్రతిపక్ష పార్టీలు రూపొందించిన బడ్జెట్‌ కు పార్లమెంటు ఓటు వేసింది. దీంతో తాము ప్రవేశపెట్టిన బడ్జెట్‌ వీగిపోవడంతో ప్రభుత్వం నుండి వైదొలిగింది. స్వీడన్ సంప్రదాయం ప్రకారం, స్వీడన్‌ ప్రధాన మంత్రి పదవికి ఆమె రాజీనామా సమర్పించారు. ఓటింగ్ తర్వాత మీడియా సమావేశంలో మాట్లాడిన ప్రధాని ఆండర్సన్, సంక్షేమం, వాతావరణ మార్పులు, నేరాలపై దృష్టి సారించే కార్యక్రమంతో స్వీడన్‌ ను ముందుకు తీసుకెళ్లడానికి తాను సిద్ధంగా ఉన్నానని ఆండర్సన్ చెప్పారు