Begin typing your search above and press return to search.
వైఎస్ వివేకా హత్య కేసులో కీలక పరిణామం
By: Tupaki Desk | 27 Sep 2021 1:40 PM GMTవైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణ సుధీర్ఘంగా సాగుతోంది. సీబీఐ అధికారులు తమకు అనుమానమున్న ప్రతిఒక్కరినీ విచారిస్తూ అసలు విషయాన్ని రాబట్టడానికి యత్నిస్తున్నారు. అయితే ఎంతకాలం ఈ విచారణ ఉంటుందో తెలియదు. కానీ విచారణలో మాత్రం కొత్త కొత్త పేర్లు బయటికి వస్తున్నాయి. మొన్నటి వరకు వాచ్ మెన్ రంగయ్య, మాజీ డ్రైవర్ దస్తగిరిల పేర్లు వినిపించగా.. తాజాగా మున్నా పేరు బయటికి వచ్చింది. కొద్దిరోజులుగా సీబీఐ అధికారులు విచారిస్తున్నారు.
ఏపీ సీఎం జగన్ బాబాయి, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ హత్య కేసులో సీబీఐ దర్యాప్తు కొనసాగుతుండగా అనూహ్య మలుపు చోటుచేసుకుంది. ఈ కేసులో కీలక అనుమానితుడిగా భావిస్తున్న మున్నా నార్కో పరీక్షలకు అంగీకరించాడు. మెజిస్ట్రేట్ ఎదుట తన సమ్మతిని తెలిపాడు. దాంతో పులివెందుల కోర్టు అతడికి నార్కో పరీక్షలు నిర్వహించేందుకు సీబీఐ అధికారులకు అనుమతి ఇచ్చింది.
నార్కో పరీక్షలు నిర్వహించేందుకు గాను మున్నాను సీబీఐ అధికారులు త్వరలో గుజరాత్ కు తీసుకెళ్లనున్నారు. వివేకా హత్య కేసు తర్వాత పులివెందులలోని ఓ బ్యాంకులో మున్నాకు చెందిన లాకర్ లో రూ.40 లక్షలకు పైగా నగదు గుర్తించారు. మున్నా పులివెందులలో ఓ చెప్పుల షాపు యజమాని. అయితే వివేకా మాజీ డ్రైవర్ దస్తగిరితో మున్నా సంబంధాల నేపథ్యంలో సీబీఐ అతడిపైనా విచారణ చేపట్టింది.
వైఎస్ వివేకా హత్య జరిగిన 2019 మార్చి 14న రాత్రి ఆయనతోపాటు కారులో ఉన్నది ఎర్ర గంగిరెడ్డి మాత్రమే. ఆ తర్వాత అర్థరాత్రి దాటాకా.. నలుగురు వ్యక్తులు వైఎస్ వివేకా ఇంట్లోకి చొరబడి ఉంటారని సీబీఐ తేల్చింది. ఎర్ర గంగిరెడ్డి పాత్ర ఈ హత్యలో ఉందని తేల్చిన సీబీఐ అతడిని అరెస్ట్ చేసింది. తాజాగా మున్నాను విచారిస్తోంది.