Begin typing your search above and press return to search.

బీపీసీఎల్‌ ప్రైవేటీకరణ దిశగా కీలక ముందడుగు!

By:  Tupaki Desk   |   27 March 2021 11:00 AM GMT
బీపీసీఎల్‌ ప్రైవేటీకరణ దిశగా కీలక ముందడుగు!
X
ప్రభుత్వ రంగ చమురు దిగ్గజం భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ (బీపీసీఎల్‌) ప్రైవేటీకరణ దిశగా మరో కీలక ముందడుగు వేసింది. అసోంలోని నుమాలీగఢ్‌ రిఫైనరీ నుంచి బీపీసీఎల్‌ పూర్తిగా వైదొలిగినట్లు వెల్లడించింది. ఎన్ ‌ఆర్‌ ఎల్‌ లో తనకున్న 61.65 శాతం వాటాను అస్సాం ప్రభుత్వం, ఆయిల్‌ ఇండియా లిమిటెడ్, ఇంజినీర్స్‌ ఇండియా కన్సార్షియానికి విక్రయించినట్లు పేర్కొంది. ఈ ఒప్పంద విలువ సుమారు రూ. 9,876 కోట్లుగా వెల్లడించింది. మొత్తం 61.5 శాతం బీపీసీఎల్‌ వాటాల్లో ఆయిల్‌ ఇండియా 54.16 శాతం, దాని భాగస్వామి ఇంజినీర్స్‌ ఇండియా లిమిటెడ్ 4.4 శాతం, మిగిన వాటాల్ని అసోం ప్రభుత్వం కొనుగోలు చేసింది.

దీంతో ఎన్‌ ఆర్‌ ఎల్‌ లో ఆయిల్‌ ఇండియా వాటా 80.16 శాతానికి చేరింది. ‘అస్సాం శాంతి ఒడంబడిక’ ప్రకారం ఎన్‌ ఆర్ ‌ఎల్ ‌ను ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే ప్రైవేటీకరణ దిశగా సాగుతున్న బీపీసీఎల్‌.. ఎన్ ‌ఆర్‌ ఎల్‌ ను పక్కకు తప్పించడం ద్వారా దాన్ని ప్రభుత్వ రంగంలోనే కొనసాగించనుంది. బీపీసీఎల్ ‌ను ప్రైవేటీకరించడంలో భాగంగా కంపెనీలో తనకున్న మొత్తం 52.98 శాతం వాటాలను కేంద్రం విక్రయిస్తోంది. 2021–22 ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంలో ఈ ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. వేదాంత గ్రూప్ ‌తో పాటు అపోలో గ్లోబల్, థింక్‌ గ్యాస్‌ తదితర సంస్థలు వీటిని కోనుగోలు చేసేందుకు రేసులో ఉన్నాయి.