Begin typing your search above and press return to search.

ఆర్టీసీ సమ్మె పోరులో కీలక ట్విస్ట్

By:  Tupaki Desk   |   6 Oct 2019 8:16 AM GMT
ఆర్టీసీ సమ్మె పోరులో కీలక ట్విస్ట్
X
తెలంగాణ కోసం కొట్లాడిన ఆర్టీసీ ఉద్యోగులు ఇప్పుడు తెలంగాణ సాధించాక తమ హక్కుల సాధనకు సమ్మెకు దిగారు. కేసీఆర్ ఎస్మా ప్రయోగిస్తామని.. ఉద్యోగాలు తీసేస్తామని బెదిరించినా లెక్క చేయకుండా రెండోరోజు సమ్మెలో పాల్గొన్నారు.

ఆర్టీసీ సమ్మెతో పండుగ పూట సొంతూళ్లకు వెళ్లే వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ లో సెటిల్ అయిన వారు స్వస్థలాలకు రూ.50 నుంచి రూ.200 లోపే చార్జితో వెళ్లేవారు ఇప్పుడు రూ.500 నుంచి రూ.700 వరకు చెల్లించి వెళ్లాల్సిన పరిస్థితి దాపురించింది.అధికారులు అద్దె, ఆర్టీసీ బస్సులను తాత్కాలిక డ్రైవర్లతో నడిపిస్తున్నారు. కానీ అవి సరిపోవడం లేదు.

తెలంగాణ ఉద్యమానికి చుక్కాని అయిన బతుకమ్మలతో నిరసనను ఆర్టీసీ ఉద్యోగులు ప్రస్తుతం సమ్మెకు వాడేస్తున్నారు. బతుకమ్మలను పేల్చి డిపోల ముందు నిరసనకు పిలుపునిచ్చారు. అక్కడే బతుమ్మకలతో నిరసన తెలుపుతున్నారు. దమ్ముంటే బతుకమ్మలపై బస్సులతో తొక్కుకుంటూ వెళ్లాలని హెచ్చరిస్తున్నారు. సెంటిమెంట్ తో కూడిన వ్యవహారం కావడంతో బస్సులు ముందుకు కదలడం లేదు.

ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా బతుకమ్మ పండుగ. కార్మికులు సైతం ఇదే బతుకమ్మలతో డిపోల ఎదుట నిరసనకు దిగారు.ఇక రేపు అక్టోబర్ 7న గన్ పార్క్ వద్ద అమరులకు నివాళులర్పించి ఇందిరాపార్క్ వద్ద 15 మంది ఆమరణ దీక్షకు దిగనున్నారు. అలాగే సమ్మెకు ప్రతిపక్ష పార్టీలు వివిధ ప్రజా విద్యార్థి సంఘాల మద్దతు కోరారు. దీంతో తెలంగాణలో ఆర్టీసీ సమ్మె ఉధృతమవుతోంది.