Begin typing your search above and press return to search.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పై కీలక తీర్పు
By: Tupaki Desk | 4 Jun 2021 12:36 PM GMTఏపీలో అధికారంలోకి వచ్చిన వైసీపీ పార్టీ గుర్తింపు రద్దు చేయాలని.. సీఎం జగన్ నేతృత్వంలోని 'వైఎస్ఆర్సీపీ పార్టీ' పేరును వాడకుండా చూడాలని గతంలో అన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు మహబూబ్ బాషా ఢిల్లీ హైకోర్టులో పిటీషన్ వేశారు. ఈ పిటీషన్ పై పలు దఫాలు ఢిల్లీ హైకోర్టులో విచారణ జరిగింది.
వైసీపీ పార్టీని రద్దు చేసి ఈ పేరు ఇతరులు వాడకుండా చూడాలని పిటీషనర్ తరుఫు న్యాయవాది కోర్టును కోరారు. లెటర్ హెడ్ పోస్టర్లు బ్యానర్లలో ఈ పేరు వాడొద్దని.. తాను ముందే రిజిస్ట్రేషన్ చేయించానని భాషా హైకోర్టులో అభ్యంతరం వ్యక్తం చేశారు. గుర్తు తనకే సొంతమని వాదించారు.ముందుగా వైఎస్సార్ అనే పేరును ఎన్నికల సంఘం తమకు కేటాయించిందని.. దానిని ఇతరులు వినియోగించడానికి వీల్లేదని పిటీషనర్ తరుఫున కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.
గత కొంతకాలంగా జగన్ నేతృత్వంలోని వైసీపీ పార్టీ గుర్తుపై నెలకొన్న ఉత్కంఠకు ఎట్టకేలకు ఢిల్లీ హైకోర్టు తెరదించింది.తాజాగా సంచలన తీర్పునిచ్చింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తింపు కొనసాగుతుందని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. ఎన్నికల సంఘం అభిప్రాయాన్ని కూడా పరిగణలోకి తీసుకున్న అనంతరం ఈ మేరకు తీర్పునిచ్చింది. తప్పుడు ఉద్దేశాలతో కేసు వేశారని పేర్కొంటూ వైఎస్ఆర్ పిటీషన్ ను కొట్టివేసింది. అన్న వైఎస్ఆర్ పిటీషన్ కు ఎలాంటి మెరిట్ లేదని న్యాయస్థానం స్పష్టం చేసింది. జగన్ నేతృత్వంలోని వైసీపీ పార్టీ గుర్తింపు కొనసాగుతుందని స్పష్టం చేసింది.
దీంతో అసలు వైసీపీ పార్టీ ఉంటుందా? ఫ్యాన్ గుర్తు కొనసాగుతుందా? అన్న టెన్షన్ పడ్డ జగన్ మోహన్ రెడ్డి వర్గం ఢిల్లీ హైకోర్టు తీర్పతో ఊపిరి పీల్చుకుంది