Begin typing your search above and press return to search.
వైద్య పరికరాల కుంభకోణంలో కీలక నేత పాత్ర ?
By: Tupaki Desk | 15 April 2021 5:04 AM GMTచంద్రబాబునాయుడు హయాంలో జరిగిన వైద్యపరికరాల కొనుగోలు కుంభకోణం టీడీపీ సీనియర్ నేతలను పట్టి కుదిపేస్తోంది. అప్పట్లో వైద్యపరికరాల కొనుగోలుకు చేసిన ఖర్చును రు. 200 కోట్ల నుండి రు. 500 కోట్లకు పెంచేసినట్లు ఇఫుడు ఆదారాలతో సహా బయటపడింది. అంటే వైద్యపరికరాలు కొనకుండానే కొనేసినట్లు, రిపేర్లలో ఉన్న పరికరాలను కొత్తగా కొనుగోలు చేసినట్లు, పాత పరికాలకే సర్వీసింగ్ చేయించి కొత్తగా కొనుగోలు చేసినట్లు అప్పటి ఉన్నతాధికారులు కలరింగ్ ఇఛ్చినట్లు బయటపడింది.
అప్పట్లో కొనుగోలుకు సంబందించి అప్పట్లో ఏపిఎంఎస్ఐడీసికి ఎండిగా వ్యవహరించిన గోపీనాధ్ కీలక పాత్రదారునిగా సీఐడి గుర్తించింది. ఈయన అప్పటి ప్రభుత్వంలో కీలక బాధ్యతల్లో వ్యవహరించిన ఓ సీనియర్ మంత్రికి అల్లుడట. ఓ మంత్రికి అల్లుడైన కారణంగానే నియమ, నిబంధనలను పాటించకపోయినా ఎవరు అడ్డుచెప్పలేదట. అలాగే చేయని కొనుగోళ్ళు చేసినట్లు చూపించిన విషయం అప్పటి పెద్దలకు తెలిసినా ఎవరు మాట్లాడలేదని సమాచారం.
ఇఎస్ఐ కుంభకోణంలో ఇప్పటికే మాజీమంత్రి అచ్చెన్నాయుడుపై ఎఫ్ఐఆర్ బుక్ అయిన విషయం తెలిసిందే. ఈ కుంభకోణంలో అచ్చెన్న అరెస్టు అయి బెయిల్ పై బయటకు వచ్చారు. ఏసీబీ విచారణను మాజీమంత్రి ఎదుర్కొంటున్నారు. అలాంటి కుంభకోణమే ఇపుడు వైద్యపరికరాల విషయంలో కూడా బయటపడింది. ఇఎస్ఐ కుంభకోణంపై దర్యాప్తు చేస్తున్న ఉన్నతాధికారులకు తాజా కుంభకోణంపై ఉప్పందిందట. దాంతో తీగను లాగితే డొంకంతా కదిలిందంటున్నారు.
జరిగిన భారీ కుంభకోణంపై ఉన్నతాధికారులు మరిన్ని సాక్ష్యాధారాలను సేకరించిన తర్వాతే కేసుల నమోదు, అరెస్టులుంటాయని సమాచారం. ఎప్పుడైతే ఈ విషయం బయటకుపొక్కిందే వెంటనే పార్టీలోని సీనియర్ నేతలతో పాటు సదరు కీలక నేతలో కూడా టెన్షన్ మొదలైందట. ఎలాగైనా కేసుల్లో నుండి బయటపడాలని, అరెస్టులు జరగకుండా చూసుకోవాలని శతవిధాల ప్రయత్నిస్తున్నట్లు చెప్పుకుంటున్నారు. మరి చివరకు ఏమి జరుగుతుందో చూడాల్సిందే.