Begin typing your search above and press return to search.
ఢిల్లీ అల్లర్లలో మృత్యుంజయుడు !
By: Tupaki Desk | 28 Feb 2020 11:21 AM GMTగత కొన్ని రోజులుగా ఢిల్లీ లో పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి. ఈ మధ్య ఈ ఆందోళనలు మరింత ఉదృతంగా మారిన విషయం తెలిసిందే. ఈ ఆందోళనల కారణంగా ఇప్పటికే 38 మంది చనిపోయారు. తాజాగా ఢిల్లీ అల్లర్లలో ఒక దారుణమైన సంఘటన జరిగింది. కానీ , అలాంటి దారుణమైన పరిస్థితిని ఎదుర్కొని కూడా ఒక బాలుడు మృత్యుంజయుడు గా ఈ భూమి పైకి వచ్చాడు. అసలేమైంది అంటే ....
షబానా పర్వీన్ నిండు గర్భిణి. సోమవారం రాత్రి ఆమె తన భర్త, అత్త, ఇద్దరు పిల్లలతో ఈశాన్య ఢిల్లీలో ఉన్న కరవాల్ నగర్ లోని తమ ఇంట్లో నిద్రపోతున్నారు. అంతలో హఠాత్తుగా ఒక గుంపు ఆ ఇంట్లోకి చొరబడి, బూతులు తిడుతూ ఆ కుటుంబంపై దాడికి దిగింది. పర్వీన్ భర్తను విచక్షణారహితంగా కొట్టారు. పర్వీన్ పైనా దాడి చేసారు. నిండు గర్భిణీ అని కూడా చూడకుండా ... ఆమె పొత్తికడుపుపైనా కొట్టారు. ఇంటికి నిప్పంటించారు. ఇక ప్రాణాలు దక్కే అవకాశమే లేదు అని ,జీవితాలపై ఆశలు వదిలేసుకున్నారు.
కానీ, ఆ తర్వాత చిన్నగా అక్కడినుండి ఎలాగోలా తప్పించుకున్న ఆ కుటుంబం దగ్గర్లోని ఆసుపత్రికి వెళ్లింది. అక్కడి వైద్యులు అల్ హింద్ ఆసుపత్రికి వెళ్లమన్నారు. అక్కడికి వెళ్లారు. అక్కడ పర్వీన్ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. అప్పటివరకు ప్రాణ భయంతో పరుగులు పెట్టిన ఆ కుటుంబం ..ఆ బాబు మొఖం చూడగానే అప్పటివరకు పడిన బాధని మరచిపోయారు. ఈ సందర్భంగా పర్వీన్ అత్త నసీమా మాట్లాడుతూ.. గుంపుగా వచ్చిన కొందరు మమ్మల్ని దూషించారు. నా కొడుకును కొట్టారు. వారిలో కొందరు గర్భిణి అయిన నా కోడలును పొత్తి కడుపులో తన్నారు. వారి బారి నుంచి ఆమెను రక్షించడానికి వెళితే నాపై కూడా దాడి చేశారు. మాకు ఆ రాత్రి కాళరాత్రే అవుతుందని అనుకున్నాం. దేవుడి దయతో మేము ప్రాణాలతో బయటపడ్డాం. ఈ దాడిలో మేం సర్వం కోల్పోయినా ... బిడ్డ పుట్టడం చాలా సంతోషంగా ఉంది. అయితే ఇప్పుడు మా కుటుంబం ఎక్కడికి వెళ్లాలో దిక్కుతోచని స్థితి. మాకు ఏమీ మిగల్లేదు. మా స్వస్థలానికి వెళ్లి మళ్లీ కొత్త జీవితాన్ని ప్రారంభించాల్సిందే’ అని వాపోయింది.