Begin typing your search above and press return to search.

కిలో మటన్ రూ.50 మాత్రమే

By:  Tupaki Desk   |   20 Dec 2021 11:51 AM IST
కిలో మటన్ రూ.50 మాత్రమే
X
మన ఏరియాల్లో ఒక్కో గొర్రెను 5 వేల నుంచి రూ.10వేల వరకు కొని దాన్ని ఖైమా కొట్టి మటన్ చేసుకుంటాం. బయట మార్కెట్లో ప్రస్తుతం కిలో రూ.600 అంటేనే అబ్బో అంటాం.

బక్రీద్ నాడు గొర్రెకు భారీ ధర పలకడం చూసి నిజంగా అందరినీ ముక్కున వేలేసుకునేలా చేసింది. అయితే ఇక్కడ మటన్ వ్యాపారులు పంతాలకు పోయి ధర తగ్గించి కేవలం కిలో మటన్ రూ.50 చొప్పున అమ్మి నిండా మునిగారు. దొరికింది భలే చాన్స్ అని ప్రజలంతా పోటీపడి కొని నిన్న ఆదివారం పడుంగ చేసుకున్నారు. ఈ పోటాపోటీ వ్యాపారం అందరినీ ఆశ్చర్చపరిచింది.

వాల్మీకిపురంలో మాంసం ప్రియుల పంట పండింది. ఆదివారం సాయంత్రం వ్యాపారస్తులు పోటీ పడి తగ్గించడంతో కిలోపొట్టేలు/మేక మాసం కేవలం రూ.50 వంతున అమ్మకాలు సాగించారు. కొనుగోలు దారులు సైతం పోటీలు పడి ఒక్కొక్కరు ఐదు నుంచి పది కిలోల వరకూ కొన్నారు.

గాంధీ బస్టాండు వద్ద ఉన్న ఒక దుకాణాదారుడు కిలో రూ.300 బేరం సాగించాడు. దీంతో ఇతర దుకాణాదారులు పోటీలు పడి రూ.200లు, రూ.100 అంటూ తగ్గించారు. చివరకు ఒక దుకాణాదారుడైతే కేవలం రూ.50లకు ధర పెట్టాడు. రాత్రి ఏడున్నరకు స్టాకు పూర్తయిపోయింది.

దుకాణదారుల పోటీయే ధర తగ్గడానికి కారణంగా చెబుతున్నారు. అయితే మటన్ కంటే చికెన్ రేటు మాత్రం ఎక్కువగా ఉండడం విశేషం. కిలో చికెన్ రూ.160 వంతున అమ్మకాలు సాగించారు.

వారం క్రితం వరకూ ఇదే కలికిరిలో కిలో మటన్ రూ.400 , చికెన్ రూ.160 వంతున విక్రయించారు. ఇప్పటికీ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. వ్యాపారులు పోటీ పడి పంతానికి పోయి వారికి వారే ధర తగ్గించుకొని నష్టపోయిన పరిస్థితి నెలకొంది.