Begin typing your search above and press return to search.

మగాళ్లు లేని మహిళల రాజ్యం .. ఎక్కడుందో తెలుసా , ప్రత్యేకత ఇదే ?

By:  Tupaki Desk   |   9 March 2021 1:30 PM GMT
మగాళ్లు లేని మహిళల రాజ్యం .. ఎక్కడుందో తెలుసా , ప్రత్యేకత ఇదే ?
X
మార్చి 8 .. అంతర్జాతీయ మహిళా దినోత్సవం. అంతర్జాతీయ మహిళా దినోత్సవం అనగానే ముందుగా మొసో మహిళల గురించి చెప్పుకోవాలి. దీనికంటే ముందు మరో విషయాన్ని చూస్తే .. వాటికన్‌ సిటీలో ఆడవాళ్లు ఉండరు. అక్కడంతా మగవాళ్లదే రాజ్యం. అలాగే, సగభాగం ఆడవాళ్లు ఉన్న చోట కూడా మగవాళ్లదే కదా పెత్తనం. అయితే, వాటికన్‌ సిటీకి కంప్లీట్‌గా రివర్స్‌ చైనాలోని సెరెనె వ్యాలీ చైనాలోని సెరెనె వ్యాలీ.. హిమాలయాల్లో ఉన్న ఆ వ్యాలీలో మొసో పేరుతో ఓ గిరిజన తెగ ఉంది. ఇది పూర్తిగా మహిళల రాజ్యం. ఇక్కడంతా మహిళలే ఉంటారు. వారే సొంతంగా నిర్ణయాలు తీసుకుంటారు.

అక్కడ పురుషులు మచ్చుకైనా కనిపించరు. మొసో మహిళలు పెళ్లిళ్లు అస్సలు చేసుకోరు. లుగు అనే చెరువు చుట్టుపక్కల ఉన్నప్రాంతాన్ని మొసో మహిళలే పాలిస్తున్నారు. ఇక్కడ వ్యవసాయం నుంచి రాజ్యాధికారం వరకు అంతా మహిళలే చూస్తారు. మొసో మహిళలు ఓ సొసైటీగా ఏర్పడి వారికి అవసరమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఈ తెగకు చెందిన ఓ పదమూడేళ్ల అమ్మాయి పెళ్లి చేసుకుని నానా కష్టాలు పడిందట, అందుకే మొసో మహిళలు పెళ్లికి దూరంగా ఉంటారు. మొసో గిరిజన తెగలో మహిళలు పెళ్లిలు చేసుకోరు. మొసో మహిళలు పెళ్లిళ్లు అస్సలు చేసుకోరు.. వారి జీవితాల్లోకి ఛస్తే పురుషులను రానివ్వరు.. రానిస్తే జీవితాంతం చస్తూ బతకాల్సి వస్తుందని కాబోలు అంత గట్టి నిర్ణయం తీసుకున్నారు. మరీ వాళ్ల తెగ ఉనికి ఎలా అనే అనుమానం వచ్చింది కదా అక్కడికే వస్తున్నా సమీప ప్రాంతాల్లో నివసించే పేద కుటుంబాలు అధికంగా ఉన్న ఆడపిల్లల్ని మొసో తెగ మహిళలకు ఇస్తారు. అలా వచ్చిన ఆడపిల్లల్ని వారు సొంత బిడ్డల్లా పెంచుతారు. వారినే తమ పిల్లలుగా భావిస్తారు. వాళ్ల బాధ్యతలన్నీ వారే చూసుకుంటారు.