Begin typing your search above and press return to search.
కవితను కలిసిన ప్రేమజంట
By: Tupaki Desk | 18 Dec 2019 5:08 AM GMTతెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కమ్ మాజీ ఎంపీ.. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితను కలిసిన ఒక జంట ముచ్చట వార్తగా మారింది. దీనికి కారణం లేకపోలేదు. తాజాగా ఆమెను కలిసిన ఆ జంట తమ ప్రేమకథను చెప్పారు. అది విన్న ఆమె ఆల్ ద బెస్ట్ చెప్పటమే కాదు.. ఆ అమ్మాయికి చీరెను బహుకరించారు. ఇంతకీ కవితను కలిసి మరీ తమ లవ్ స్టోరీ చెప్పటానికి కారణం ఏమంటారా? అక్కడికే వస్తున్నాం.
తాజాగా కవితను కలిసిన ఆ జంటకు సంబంధించిన అబ్బాయి విషయానికి వస్తే.. అతగాడి పేరు స్వర్ణాకర్. సికింద్రాబాద్ కు చెందిన అతడు జర్మనీకి చెందిన అమ్మాయిని ప్రేమించాడు. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకు ఇరు వర్గాల వారు ఓకే చెప్పేశారు. అంతమాత్రానికే కవితను కలవగలరా? అంటే లేదనే చెప్పాలి. కానీ.. స్వర్ణాకర్ తెలంగాణ జాగృతి జర్మనీ విభాగం అధ్యక్షుడు కావటంతో అతనికి తమ ప్రేమకథ గురించి తమ సంస్థ అధ్యక్షురాలు కవితను కలిసి చెప్పుకునే అవకాశం లభించింది.
ఈ లవ్ స్టోరీలో మరో ఆసక్తికర కోణం.. అమ్మాయి జర్మనీకి చెందిన జూలియా కావటం. త్వరలో వీరి పెళ్లి జరగనుంది. డిసెంబరు 22న జరిగే తమ వివాహానికి హాజరు కావాల్సిందిగా కోరారు. ఉద్యోగంలో భాగంగా జర్మనీకి చెందిన స్వర్ణాకర్ అక్కడే ఉద్యోగం చేస్తూ.. తెలంగాణ జాగృతి కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారు. తక్కువ వ్యవధిలోనే జర్మనీ విభాగానికి అధ్యక్షులుగా ఎంపికయ్యారు. తాజాగా తన పెళ్లి నేపథ్యంలో జాగృతి అధ్యక్షురాలు కవితను కలిసి.. తమ ప్రేమకథను చెప్పటమే కాదు.. పెళ్లిశుఖలేఖను అందించారు. దీంతో.. ఆ జంటకు కవిత ఆల్ ద బెస్ట్ చెప్పి ఆశీర్వదించారు.