Begin typing your search above and press return to search.

రోటీన్ కు భిన్నమైన లవ్ స్టోరీ: పెళ్లి కోసం అమ్మాయిగా మారాక!

By:  Tupaki Desk   |   7 May 2022 7:28 AM GMT
రోటీన్ కు భిన్నమైన లవ్ స్టోరీ: పెళ్లి కోసం అమ్మాయిగా మారాక!
X
రీల్ స్టోరీకి ఏ మాత్రం తీసిపోని సిత్రమైన లవ్ స్టోరీగా దీన్ని చెప్పాలి. గతంలో లవ్వు అన్నంతనే అమ్మాయి.. అబ్బాయి అన్నదాన్లో ఎలాంటి సందేహం ఉండేది కాదు. దరిద్రపుగొట్టు రోజులు వచ్చేశాక..అమ్మాయిని అమ్మాయి..

అబ్బాయిని అబ్బాయి ప్రేమించుకోవటం లాంటివి చోటు చేసుకుంటున్నాయి. చట్ట ప్రకారం కూడా ఇలాంటి పెళ్లిళ్లకు ఎలాంటి అడ్డంకులు లేని నేపథ్యంలో కొంతకాలంగా ఈ తరహా ప్రేమలు బయటకు వస్తున్నాయి.

కాకుంటే.. ఈ మధ్యన ఇలాంటివి తరచూ వింటున్న పరిస్థితి. తాజాగా అలాంటి ప్రేమ ఒకటి చిత్తూరు జిల్లాలో చోటు చేసుకుంది. కాకుంటే.. దీని ముగింపు మాత్రం భిన్నంగా ఉండటం గమనార్హం.అసలేమైందంటే.. చిత్తూరు జిల్లా నిమ్మనపల్లె మండలానికి చెందిన లోకేశ్ మదనపల్లెలో ఇంటర్ చదువుకున్నాడు.

ఆ సమయంలో మరో అబ్బాయి అయిన మహేశ్ ప్రేమలో పడ్డాడు. అయితే.. తామిద్దరం పెళ్లి చేసుకోవాలంటే లోకేశ్ ను అమ్మాయిగా మారాలని కోరాడు. దీంతో.. మహేశ్ కోరినట్లే లోకేశ్.. తన పేరును స్వీటీగా మార్చేసుకున్నాడు.

వీరిద్దరూ ఆరేళ్లు సహజీవనం చేశారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. ఇక్కడే తేడా కొట్టింది. ఈ మధ్యన తనకు పిల్లలు కావాలని.. అందుకే మరో పెళ్లి చేసుకుంటానని మహేశ్ కు చెప్పటంతో స్వీటీకి ఏం చెప్పాలో అర్థం కాని పరిస్థితి. ఈ వేదనలో ఉన్న వేళలోనే.. తనతోసన్నిహితంగా ఉన్న ఫోటోలు.. వీడియోలు.. మెసేజ్ లను స్వీటీ ఫోన్ లో ఉన్నవన్నీ డిలీట్ చేసినట్లు పేర్కొంది.

దీంతో తనకు న్యాయం చేయాలంటూ చిత్తూరు పోలీసుల్ని ఆశ్రయించింది స్వీటీ. ఇన్నాళ్లు తనతో కలిసి ఉన్న మహేశ్ ఇప్పుడు ఇలా చేయటం ఏమిటంటూ స్వీటీ విలపిస్తోంది. ప్రేమ కోసం అమ్మాయిగా మారిన స్వీటీ వేదన అంతా ఇంతా కాదన్నట్లుగా ఉంది.