Begin typing your search above and press return to search.

ఆ వరద నీటిలో కొట్టుకుపోయిన వ్యక్తి చనిపోలేదు ..కానీ, ఆ ఆనందం క్షణాల్లో ఆవిరైపోయింది !

By:  Tupaki Desk   |   16 Oct 2020 2:50 PM GMT
ఆ వరద నీటిలో కొట్టుకుపోయిన వ్యక్తి చనిపోలేదు ..కానీ, ఆ ఆనందం క్షణాల్లో ఆవిరైపోయింది !
X
ఇటీవలే తెలంగాణలో కురిసిన భారీ వర్షాలకు హైదరాబాద్ మహానగరం మహాసముద్రాన్ని తలపించింది. గత వందేళ్ల లో ఒకేరోజు అంతటి వర్షపాతం నమోదు కాలేదు అని అధికారులు కూడా ప్రకటించారు. అసలు ఆకాశానికి చిల్లులు పడ్డాయా అన్నట్టుగా కుండపోత వర్షం కురిసింది. ఎదో సినిమాలో చెప్పినట్టు నేను ఎమ్మెల్యే గా గెలిస్తే హైదరాబాద్ కి ఓడరేవు తెస్తానని ..ప్రస్తుత పరిస్థితి కూడా అదే. ఇంకా కొన్ని చోట్ల నీరు అలాగే ఉండటంతో పడవల్లో తిరగాల్సిన పరిస్థితి. ఈ వర్షానికి , వరదకి గ్రేటర్ హైదరాబాద్ మొత్తం అతలాకుతలం అయింది. ఇదిలా ఉంటే ... వరద నీటిలో ఒక వ్యక్తి కొట్టుకుపోతున్న వీడియో ఒకటి సోషల్ మీడియా లో తెగ వైరల్ అయింది. అందరూ చూస్తుండగానే ఆ వరద నీటి ప్రవాహ దాటికి నిలబడలేక కొట్టుకుపోయాడు. అయ్యో అనడమే తప్ప , ఎవరు ఏమీ చేయలేని పరిస్థితి. అయితే , అతను చనిపోలేదు. కానీ, నేను ప్రాణాలతో బ్రతికి బయటపడ్డానన్న ఆనందం ఎక్కువ సేపు మిగలలేదు.

పూర్తి వివరాల్లోకి వెళ్తే .. మైలార్ దేవ్ పల్లిలో ఉంటున్న తాహెర్, తన ఇద్దరు కొడుకులు, తమ్ముడితో కలిసి బయటకొచ్చాడు. పని ముగించుకొని తిరిగి ఇంటికెళ్లే సమయంలో భారీ వర్షాలకు పక్కనే ఉన్న గోడ కూలింది. దీంతో పాటే వరద నీరు వేగంగా ప్రవహిస్తుంది. ఆ వరదలో కొట్టుకుపోయాడు తాహెర్. అక్కడ సమీపంలో ఉన్న ఓ వ్యక్తి కొట్టుకుపోతున్న సమయంలో వీడియో తీయడం తీసి పోస్ట్ చేయడంతో అది సోషల్ మీడియా లో , మీడియా లో వైరల్ అయింది. ఆ నీటి ప్రవాహం స్పీడ్ చూసి , అతడి చనిపోయి ఉంటాడని అంతా అనుకున్నారు. కానీ మైలార్ దేవ్ పల్లి నుంచి ఫలక్ నుమా వరకు 3 కిలోమీటర్లు కొట్టుకుపోయిన ఆ వ్యక్తి, ఓ చెట్టును పట్టుకొని చివరికి ఎలాగోలా ప్రాణాలతో బయటపడ్డాడు.ప్రాణాలతో బయటపడిన తాహెర్ కు ఆ ఆనందం ఎక్కువ సేపు నిలవలేదు. అదే ప్రమాదంలో తనతో పాటు కొట్టుకుపోయిన ఇద్దరు కొడుకులు, తమ్ముడు మృత్యువాత పడ్డారని తెలిసి కొండంత దుఃఖంలో మునిగిపోయాడు. ఈ తరహా కథలు కథలు హైదరాబాద్ లో ఇప్పుడు చాలా ఉన్నాయి.