Begin typing your search above and press return to search.

గిఫ్ట్​ అంటే ఇదీ..! శ్రీమతి కోసం జాబిల్లి మీద స్థలం కొన్న భర్త..!

By:  Tupaki Desk   |   27 Dec 2020 11:00 AM GMT
గిఫ్ట్​ అంటే ఇదీ..!  శ్రీమతి కోసం జాబిల్లి మీద స్థలం కొన్న భర్త..!
X
చాలామంది తమ భర్తలు తమ భర్తల కోసం ఖరీదైన బహుమతులు ఇవ్వడం మనం వింటూ ఉంటాం. డైమండ్​ నక్లెస్​లు, విలువైన గడియారాలు, ఖరీదైన కార్లు, విల్లాలు, ఫ్లాట్స్​లు ఆ జాబితాలో ఉండొచ్చు. లేదా ఏదైనా సడెన్ సర్ప్రైజ్ చేసి బహుమతి అందించడం చూస్తూనే ఉంటాం. కానీ ఓ వ్యక్తి మాత్రం వినూత్నంగా ఆలోచించాడు. భార్య కోసం ఏదైనా విభిన్నమైన బహుమతి ఇవ్వాలనుకున్నాడు. అందుకే ఈ భూమి మీద కాకుండా.. చంద్రమండలం మీద జాగా కొన్నాడు. ఇక భర్త గిఫ్ట్​చూసి భార్య ఫుల్​ ఖుషీ అయ్యిందట.

తన మీద భర్తకు ఉన్న ప్రేమ చూసి ఉప్పొంగి పోయిందట. ఈ బహుమతి గురించి ఆ నోటా ఈ నోటా పడి సోషల్ మీడియా వరకూ పాకింది. దీంతో నెటిజన్లు ‘గిఫ్ట్​ అంటే ఇదీ’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. రాజస్థాన్‌లోని అజ్మర్‌ ప్రాంతానికి చెందిన ధర్మేంద్ర అనీజాకు భార్య అంటే ఎనలేని ప్రేమ. ఎనిమిదో వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య సాప్నా అనీజాకు ఏదైనా కొత్త బహుమతి ఇవ్వాలనుకున్నాడు. అందుకే ఏకంగా చంద్రమండలంలో మూడెకరాలు కొనేసి భార్యకు బహుమతిగా ఇచ్చాడు.

'డిసెంబర్‌ 24న మా పెళ్లి రోజు. అందరిలా కార్లు, నగలు కాకుండా నా భార్యకు ఏదైనా స్పెషల్‌ బహుమతి ఇద్దామనుకున్నా. అందుకే చంద్రమండలం మీద స్థలం కొన్నాను. ఇప్పటికే మన దేశానికి చెందిన కొందరు చంద్రమండలంపై స్థలాలు కొన్నారు. కానీ రాజస్థాన్​ నుంచి చంద్రుడిపై స్థలం కొన్న వ్యక్తిని నేనే’ అంటూ ఆయన చెప్పుకొచ్చారు.
భర్త గిఫ్ట్​ పట్ల భార్య తెగ ముచ్చటపడిపోతుందట. అమెరికాలోని లూనా సొసైటీ ఇంటర్నేషనల్‌ కంపెనీ ద్వారా అనీజా.. చందమామ మీద జాగా కొన్నట్టు అనిజా చెప్పాడు.