Begin typing your search above and press return to search.

భార్యకు చీటింగ్.. ప్రియురాలితో ఇటలీ టూర్.. కరోనా అటాక్

By:  Tupaki Desk   |   20 March 2020 1:30 AM GMT
భార్యకు చీటింగ్.. ప్రియురాలితో ఇటలీ టూర్.. కరోనా అటాక్
X
కరోనా భయం ప్రపంచాన్ని ఆవహించింది. కాలు బయట పెట్టలేని పరిస్థితి నెలకొంది. ఏ క్షణంలో వైరస్ తమకు సోకుతుందని అందరూ బతుకుజీవుడా అంటూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బతుకీడుస్తున్నారు.

అయితే బయట ఇంత దారుణ పరిస్థితులుంటే ఓ వ్యక్తి మాత్రం తన భార్యకు తెలియకుండా సీక్రెట్ ట్రిప్ కు వెళ్లాడు. తన ప్రియురాలితో బాగానే ఎంజాయ్ చేశాడు. అదే అతడి పాలిట శాపమైంది. భార్యను మోసం చేసిన పాపానికి అతడికి కరోనా సోకింది.

బ్రిటన్ దేశానికి చెందిన ఒక వ్యక్తి తన భార్యకు బిజినెస్ ట్రిప్ అని చెప్పి తన ప్రియురాలితో కలిసి ఇటలీలో ఎంజాయ్ చేయడానికి వెళ్లాడు. భార్య కూడా భర్తను నమ్మేసింది. మనోడు ఇటలీలో తెగ ఎంజాయ్ చేసి వచ్చాడు. కొద్ది రోజుల తర్వాత తీవ్రమైన జ్వరం, దగ్గు వచ్చాయి. వైద్యపరీక్షల్లో కరోనా వచ్చిందని తెలియడంతో షాక్ అయ్యాడు. దీంతో ఇటలీలో ప్రియురాలితో కలిసి ఎంజాయ్ చేయడమే అతడికి శాపమైంది.

భర్తను హాస్పిటల్ కు తరలించిన వైద్యులు, అతడి భార్యను ఇంట్లోనే ఐసోలేషన్ లో ఉంచారు. ఎక్కడెక్కడ? ఎవరితో తిరిగావని అడిగితే అసలు విషయం చెప్పాడు. ప్రియురాలి పేరు కూడా అతడు చెప్పలేదు. తన భార్యకు ఈ విషయం చెప్పవద్దని వేడుకున్నాడట.. ఈ విషయం మీడియాకు తెలియడంతో మనోడి రాసలీలల బాగోతం వెలుగుచూసింది. ఇతడు పనిచేస్తున్న కంపెనీ అందరు ఉద్యోగులకు సెలవులు ఇచ్చేసి వర్క్ ఫ్రం హోం చేయమందట..

ఇలా ప్రియురాలితో సరసం అతడి ప్రాణాల మీదకు తెచ్చింది. భార్యను ఇబ్బందుల పాలు చేసింది. చైనా తర్వాత ఇటలీలో కరోనా వైరస్ కలకలం దారుణంగా తయారైంది. ఇలా అక్కడి నుంచి ప్రపంచానికి పాకుతోంది. ఇటలీలో కరోనా కల్లోలాలు ఒక్కటొక్కటిగా వెలుగుచూస్తున్నాయి.