Begin typing your search above and press return to search.
అత్యాచారం చేశాడు .. భయంతో ఆత్మహత్య చేసుకున్నాడు!
By: Tupaki Desk | 1 Jan 2021 12:30 AM GMTప్రస్తుత సమాజంలో జరిగే కొన్ని సంఘటనలు చూస్తే అసలు వాటిపై ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా తెలీదు. ఎందుకు అంటే జరిగే సంఘటనలు అలా ఉన్నాయి. ఆవేశంలో చేసిన తప్పులు అయినా ప్రేరేపితంగా చేసిన నేరాలైనా కూడా చివరికి శిక్ష అనుభవించాల్సిందే. అది చట్టం. కానీ చేసిన తప్పును తెలుసుకుని తనకు తానుగా శిక్ష వేసుకోవాలని భావించి ఆత్మహత్య చేసుకున్నాడో యువకుడు. ఈ ఘటన పై పూర్తి వివరాల్లోకి వెళ్తే ..
రంగారెడ్డి జిల్లా పరిధిలోని ఒక యువకుడు బోర్ మెకానిక్ గా పనిచేస్తూ, తల్లిదండ్రులతో పాటు జీవనం కొనసాగిస్తున్నాడు. ఆ ప్రాంతానికే చెందిన ఓ వివాహిత అతణ్ని లిఫ్ట్ అడిగింది. అటుగా వెళ్లాల్సిన వైపుకు కాకుండా రూటు మార్చి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు. ఆమెపై బలవంతంగా అత్యాచారం చేశాడు. ఘటన జరిగిన తర్వాత భయంతో అక్కడ నుంచి పారిపోయాడు. తనకు జరిగిన దారుణానికి పోలీస్ స్టేషన్ కు వెళ్లి కంప్లైంట్ ఇచ్చింది ఆ మహిళ. ఆ విషయం తెలుసుకున్నాడు శంకర్. అత్యాచారానికి తెగించిన అతడికి భయం మొదలైంది. తాను చేసిన తప్పుకు శిక్షపడుతుందని భయపడ్డాడు.
పారిపోయినా పట్టుకుంటారని ఆత్మహత్య చేసుకోవాలని ఫిక్స్ అయ్యాడు. కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్లిన మహిళ నేరుగా పోలీసులను శంకర్ ఉండే తమ ప్రాంతానికే తీసుకువస్తుందని తెలుసుకున్నాడు. మరోవైపు నుంచి పరారై ఊరవతల ఉన్న చెట్టుకు ఉరి పెట్టుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అఘాయిత్యానికి పాల్పడి తప్పు చేశాడు. చేసిన తప్పుకు ఎదురయ్యే పరిణామాలకు భయపడి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం పోలీసులు వైద్యపరీక్షలకు పంపారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలకై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.