Begin typing your search above and press return to search.
భార్య తల నరికి .. తల పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లిన భర్త !
By: Tupaki Desk | 9 Oct 2020 2:00 PM GMTఉత్తరప్రదేశ్ లో ఈ మధ్య వరుసగా దారుణ సంఘటనలు జరుగుతున్నాయి. తాజాగా యూపీలో భార్యపై అనుమానంతో ఓ భర్త ఆవేశంలో ఆమె తల క్రూరంగా నరికి, ఎదో ఘన కార్యం చేసినట్టు , ఆమె తలను తీసుకుని నేరుగా పోలీస్ స్టేషన్ వెళ్లి లొంగిపోయాడు. నిర్ఘాంతపోయే ఈ సంఘటన యూపీలోని బాండా ప్రాంతంలో చోటుచేసకుంది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే .. ఉత్తరప్రదేశ్లోని బాందా జిల్లా, నీతానగర్ లో నివసించే దంపతులకు గత కొన్నేళ్ల క్రితం వివాహం అయ్యింది. ఈ మధ్య భార్య ప్రవర్తనపై అనుమానం పెంచుకున్న ఆ భర్త తరచూ భార్యతో గొడవ పడుతున్నాడు. ఈ క్రమంలో అక్టోబర్ 9, శుక్రవారం ఉదయం గం.7-30 సమయంలో తిరిగి భార్యా భర్తల మధ్య మరోసారి వాగ్వాదం జరిగింది. ఈ సమయంలో కోపం పెరిగి పోయిన భర్త పదునైన కత్తితో నరికి , భార్య తలను శరీరం నుండి వేరుచేశాడు. తల తీసుకుని నేరుగా బాబేర్ పోలీసుస్టేషన్ కు వెళ్లి లొంగిపోయాడు.
నిందితుడు తన భార్య తల పట్టుకుని పోలీస్ స్టేషన్ కు నడిచివెళ్తున్న దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. భార్య తలతో లొంగిపోయేందుకు వచ్చిన భర్త ను పోలీసులు అరెస్ట్ చేశారు. అలాగే భార్య తలను నరికివేయడానికి ఉపయోగించిన పదునైనా ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నారు. అలాగే బాధితురాలిని మృతదేహాన్ని పోస్టుమార్టమ్‌కు పంపించినట్టు ఎస్పీ మహేంద్ర ప్రతాప్ సింగ్ చౌహన్ తెలిపారు.