Begin typing your search above and press return to search.

అమెరికాలో భారతీయ మహిళలను భయభ్రాంతులకు గురిచేస్తున్న వ్యక్తి అరెస్ట్

By:  Tupaki Desk   |   6 Oct 2022 9:31 AM GMT
అమెరికాలో  భారతీయ మహిళలను భయభ్రాంతులకు గురిచేస్తున్న వ్యక్తి అరెస్ట్
X
అమెరికా 'అమ్మో'రికా అనేలా తయారవుతోంది. భారతీయులపై జాత్యాహంకార దాడులు.. తాజాగా ఓ భారతీయ కుటుంబం హత్యతో అంతా అట్టుడుకుతున్న పరిస్థితి నెలకొంది. అమెరికాలోని భారతీయులంతా కూడా ఈ పరిణామాలతో ఆందోళన చెందుతున్న పరిస్థితులు ఏర్పడుతున్నాయి.

యుఎస్‌లో భారతీయ హిందువులపై విద్వేషపూరిత నేరాలు అయినా ఆగని పరిస్థితి నెలకొంది. రోజురోజుకు పెరుగుతున్నాయి. అమెరికా ఎదుగుదలలో కీలకంగా వ్యవహరిస్తున్న భారతీయ కమ్యూనిటీని ఆన్‌లైన్‌లో దూషించడంతో పాటు, శాంటా క్లారాలో జరిగిన వరుస ద్వేషపూరిత నేరాలు గత రెండు నెలలుగా సమాజాన్ని కదిలించాయి.

తూర్పు పాలో ఆల్టోకు చెందిన అనుమానితుడు లాథన్ జాన్సన్ సాంప్రదాయ దుస్తులు.. బంగారు ఆభరణాలు ధరించిన వృద్ధ భారతీయ మహిళలను టార్గెట్ చేసి దోపిడీకి యత్నించడం కలకలం రేపింది.

భారతీయ బంగారం వేసుకున్న మహిళలనే ప్రత్యేకంగా లక్ష్యంగా చేసుకొని దాడికి యత్నించడం హిందూ సమాజంలో భయాన్ని వ్యాప్తి చేసింది. ఇది భారతీయులకు పండుగ సీజన్ అని.. అనుమానితుడు ఇలా చేయడంపై ఆందోళన వ్యక్తం అవుతోంది. అతను స్త్రీలను వీధికి లాగి, వారి భర్తలను కొట్టి, బంగారు ఆభరణాలను దొంగతనం చేస్తూ దారుణంగా భయభ్రాంతులకు గురిచేస్తున్నాడు. బాధితులందరూ 50 మరియు 73 సంవత్సరాల మధ్య వయస్సు గలవారు కావడంతో వాడితో పోరాడడం లేదు.

ద్వేషపూరిత నేరాలు మరియు ఆన్‌లైన్ హిందూ ఫోబియాలో పెరుగుదల ఉందని హిందూ అమెరికన్ ఫౌండేషన్‌కు చెందిన సమీర్ కల్రా చెప్పారు. భారతీయ హిందువులకు ఇలాంటి భయానక అనుభవాలు ఎదురైతే ముందుకు వచ్చి వారి అనుభవాలను పోలీసులకు తెలియజేయాలని సూచిస్తున్నారు..లాథన్ జాన్సన్ నుపోలీసులు పట్టుకొని అరెస్ట్ చేశారు.

అయితే అతడు కోర్టుకు హాజరుకాలేదు. జాన్సన్ ఎటువంటి బెయిల్ లేకుండా కస్టడీలో ఉన్నాడు. ద్వేషపూరిత నేరాలకు పాల్పడితే గరిష్టంగా 63 సంవత్సరాల జైలు శిక్ష విధించబడుతుంది. విద్వేషపూరిత నేరాలకు వ్యతిరేకంగా కఠినమైన చర్యలు తీసుకోవాలని వివిధ కౌంటీలు సూచిస్తున్నాయి.

ఇండో-అమెరికన్ హిందువులు అనేక చెదురుమదురు సంఘటనలు.. ఆన్‌లైన్ హిందూఫోబియా యొక్క విస్తృతమైన వ్యాప్తి కారణంగా ఆందోళనగా ఉన్నారు..


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.