Begin typing your search above and press return to search.
మనిషి కడుపులో ప్రపంచంలోనే పెద్ద నులిపురుగు
By: Tupaki Desk | 24 Sep 2020 5:40 PM GMTనులి పురుగులు.. మన పొట్టలోని జీర్ణాశయంలో ఉంటూ మనం తినే ఆహారాన్ని అవే తినేస్తుంటాయి. ముఖ్యంగా చిన్నపిల్లలు.. 18 ఏళ్లలోపు టీనేజ్ వారిలో ఈ నులిపురుగులు ఎక్కువగా ఉంటాయి. దాని ద్వారా వారికి సరైన పౌష్టికాహారం అందక ఎదుగుదల అనేది నిలిచిపోతుంది.
అందుకే మన ప్రభుత్వాలు జాతీయ నులిపురుగుల దినోత్సవాలు నిర్వహిస్తూ ‘అల్బెండజోల్ మాత్రలు’ పిల్లలకు వేస్తారు. తద్వారా నులిపురుగులను కడుపులో చంపేస్తారు.
అయితే థాయిలాండ్ దేశంలోని నాఖోన్ సావాన్ లో వింత ఘటన ఒకటి చోటుచేసుకుంది. డుయాంగ్ చన్ డాచోడ్డే అనే 43 ఏళ్ల వ్యక్తి కడుపు నుంచి 17 అడుగుల పొడవున్న ‘టేప్ వార్మ్’ నులిపురుగు ఏకంగా మల విసర్జనలో బయటకు వచ్చింది.
ఇటీవల కాలంలో తీవ్ర కడుపునొప్పితో బాధపడుతున్న డాచోడ్డేకు వైద్యులు పరీక్షలు చేయగా అతడి కడుపులో నులిపురుగులు ఉన్నట్లు గుర్తించారు. అందువల్లే వాంతులు, వికారం, బలహీనత, అలసట, జ్వరం వంటి లక్షణాలు వచ్చాయని తెలిపారు.
కాగా తాజాగా 17 అడుగుల పొడవున్న నులిపురుగులు మలం ద్వారా బయటకు రావడంతో దాన్ని పరిచి చూడగా అంత పెద్దగా కనిపించింది. ఇంతటి పెద్ద నులిపురుగు ప్రపంచంలోనే లేదని వైద్యులు తెలిపారు.
కాగా ఈ టేప్ వార్మ్ అనే అతిపెద్ద నులుపురుగులు ‘పంది మాంసం, గొడ్డు మాంసం పచ్చిది లేదా సగం ఉడికిన దానిని తినడం వల్ల మనిషి కడుపులోకి ప్రవేశిస్తుందని వైద్యులు తెలిపారు. టేప్ వార్మ్ మానవ శరీరంలోకి ప్రవేశించినప్పుడు జీవ సంబంధ సమస్యలు తలెత్తుతాయని చెప్పారు. అందుకే ఆహారాన్ని బాగా ఉడికించి తినాలని వైద్యులు సూచిస్తున్నారు.