Begin typing your search above and press return to search.

ఆడు మగాడ్రా బుజ్జీ.. 150 మంది పిల్లలకు తండ్రయ్యాడు!

By:  Tupaki Desk   |   1 Oct 2020 11:30 PM GMT
ఆడు మగాడ్రా బుజ్జీ.. 150 మంది పిల్లలకు తండ్రయ్యాడు!
X
ఒకరిద్దరూ పిల్లలను కనడమే కష్టంగా భావిస్తున్న రోజులివి.. కానీ ఓ వ్యక్తి ఏకంగా 150 పిల్లలకు తండ్రయ్యాడు. అమెరికాకు చెందిన జోయ్. పిల్లలు కనాలనుకొని.. వివిధ కారణాలతో సంతానప్రాప్తికి నోచుకోని వారికి తన వీర్యాన్ని దానం చేస్తుంటాడు. వీర్య దానం అంటే.. కేవలం వీర్యాన్ని దానం చేస్తే.. వైద్యులు సరోగసీ వంటి వైద్య విధానాల ద్వారా మహిళలు గర్భం దాల్చేలా చేస్తారు. అయితే జోయ్​ ఆ టైప్ కాదు. మహిళల అనుమతితో నేరుగానే శృంగారంలో పాల్గొంటూ వారికి సంతానప్రాప్తి కలిగిస్తున్నాడు. అమెరికాలో వీర్య దానం ఏ పద్ధతిలోనైనా చేయవచ్చు.. అది చట్టబద్ధమే. దీంతో మహిళల అనుమతితో జోయ్​ రెచ్చిపోతున్నాడు. ఇప్పటికే 150 మంది పిల్లలకు తండ్రయ్యాడు.

వీళ్లలో సగం మందితో నేరుగా శృంగారంలో పాల్గొనే ఈ పనిపూర్తిచేశాడు. మరికొందరికి తన వీర్యాన్ని దానం చేశాడు. అయితే మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే జోయ్​.. ఈ లాక్​డౌన్​ సమయంలోనూ ఖాళీగా లేడు. దాదాపు ఏడుగురికి సంతానప్రాప్తి కలిగించాడు. అది కూడా నేరుగా శృంగారంలోనే పాల్గొనె. జోయ్​ అమెరికాలోని వెర్‌మౌంట్‌లో నివసిస్తున్నాడు. సంతానప్రాప్తి కోసం నేరుగా చాలా మంది మహిళలు అతడిని సంప్రదిస్తుండటం విశేషం. అయితే 49 ఏళ్ల వయస్సులోనే జోయ్​ వీర్యం ఎంతో శక్తివంతంగా ఉందని వైద్యులు ధ్రువీకరించారు. కాగా ఈ విషయంపై జోయ్​ ఏమంటారంటే..

‘నాకు 150 మంది పిల్లలు ఉన్నారు. తాజాగా మరో ఆరుగురు యువతులను గర్భవతులను చేశా. వీరిలో ఓ మహిళ ఇటీవలే బిడ్డకు జన్మనిచ్చింది. ఏడాదికి కనీసం 10 మందిని తల్లులను చేయాలనేది నా ప్లాన్. 2008 నుంచి వీర్య దానం చేస్తున్నా. 90 ఏళ్ల వయస్సు వచ్చే వరకు వీర్యదానం చేయాలని నా కోరిక. 2500 మందికి పైగా పిల్లలకు తండ్రిని కావాలని ఉంది. నా పోలికలతో ఉన్న పిల్లలను చూసినప్పుడు నాకెంతో థ్రిల్లింగా ఉంటుంది అని చెబుతున్నాడు జోయ్​’