Begin typing your search above and press return to search.

'ఒక్కోసారి..మద్యం మంచిదే' అంటే నమ్మాల్సిందేనేమో!

By:  Tupaki Desk   |   10 Sep 2020 4:00 PM GMT
ఒక్కోసారి..మద్యం మంచిదే అంటే నమ్మాల్సిందేనేమో!
X
ఓ డిటర్జెంట్ పౌడర్ కి సంబంధించి టీవీల్లో తరచూ 'మరక మంచిదే ' అంటూ ఓ యాడ్ వస్తుంటుంది. మరక మంచిదేంట్రా బాబూ.. అనిపించినా..ఆ యాడ్ భలే క్లిక్ అయ్యింది. ఇప్పుడు 'మద్యం కూడా మంచిదే' అంటే నమ్మాల్సిందే నేమో. పిల్లలకు మద్యం బాటిళ్లు ఎవరూ గిఫ్ట్ గా ఇవ్వరు. పాడైపోతారని. కానీ ఓ వ్యక్తికి తనకు గిఫ్ట్ గా వచ్చిన మందు బాటిళ్లతో ఏకంగా లైఫ్ లో సెటిల్ అయ్యాడు. వినడానికి ఇది ఆశ్చర్యకరంగా ఉన్నా..ఇది.. నిజం.ఎవరన్నా మందుబాటిళ్లను బహుమతిగా ఇస్తే తాగి ఎంజాయ్​ చేస్తారు. కానీ న్యూయార్క్​కు చెందిన ఓ వ్యక్తి మాత్రం కొంచెం భిన్నంగా ఆలోచించాడు.

తనకు బహుమతిగా వచ్చిన 28 మందుబాటిళ్లను దాచుకొని వాటిని చాలా ఏళ్ల తర్వాత అమ్మి ఏకంగా 40 లక్షలు సంపాదించాడు. చివరకు ఇప్పడు ఆ డబ్బుతో ఇళ్లు కట్టుకున్నాడు. 28 ఏళ్ల పాటు ఆయనకు మందుబాటిళ్లను బహుమతిగా ఇచ్చింది మరెవరో కాదండి! అతడి తండ్రే. ఈ స్టోరి ఏమిటీ? ఎక్కడ జరిగిందో కాస్త తెలుసుకుందాం.. న్యూయార్క్​కు చెందిన పీట్​ రాబ్సన్​కు.. 1992 లో మాథ్యూ జన్మించాడు. అయితే వారి మత ఆచారం ప్రకారం కొడుకు పుట్టిన వెంబడే అతడి తలకు విస్కీని రాస్తారు.

అయితే పీట్​ రాబ్సన్​ మాత్రం తన కుమారుడికి ప్రతి ఏటా పుట్టినరోజునాడు ఓ విస్కీ బాటిల్​ను బహుమతిగా ఇచ్చేవాడు. ఇలా ఇప్పుడు అతడికి 28 ఏళ్లు రావడంతో మొత్తం 28 విస్కీ బాటిళ్లను సేకరించి పెట్టుకున్నాడు. వాటిని విక్రయించేందుకు అతడు ఆన్​లైన్​లో ఓ పోస్ట్​ పెట్టాడు. దీంతో ఆ విస్కీ బాటిళ్లకు అతడికి రూ. 40 లక్షల ధర పలికింది. ఆ డబ్బుతో మాథ్యూ ఓ ఇంటిని కొనుగోలు చేయబోతున్నాడట. మద్యం ఓ వ్యసనం..కానీ ఇతడికి మాత్రం మద్యం ఓ సెటిల్ మెంట్ ఇచ్చింది.