Begin typing your search above and press return to search.

8 సెకన్లు క్వారంటైన్ రూల్స్ బ్రేక్ ... రెండున్నర లక్షల ఫైన్ !

By:  Tupaki Desk   |   8 Dec 2020 12:31 PM GMT
8 సెకన్లు క్వారంటైన్ రూల్స్ బ్రేక్ ... రెండున్నర లక్షల ఫైన్ !
X
కరోనా మహమ్మారి జోరు కొనసాగుతుంది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. కొన్ని దేశాల్లో కరోనా సెకండ్ వేవ్ కూడా మొదలైంది. దీంతో ఆయా దేశాల్లో వైరస్ వ్యాప్తిని నిరోధించడానికి కఠినమైన నియమ నిబంధనలు విధిస్తున్నారు. లాక్ డౌన్ నిబంధనలను ప్రజలు సరిగ్గా పట్టించుకోవట్లేదనే ఉద్దేశంతో జరిమానా కూడా విధిస్తున్నారు. రోజురోజుకీ కేసులు ఎక్కువ అవుతుండటంతో తైవాన్ లో కూడా ఎన్నో నిబంధనలు విధించారు. కానీ అనుకోకుండా చేసిన తప్పిదం వల్ల ఒక కార్మికుడికి భారీ జరిమానా విధించారు అధికారులు.

14 రోజుల వరకు క్వారంటైన్ లో ఉండాల్సిన ఆ కార్మికుడు.. తన గది నుంచి బయటకు వచ్చి కొన్ని సెకన్ల తరువాత మళ్లీ లోపలికి వెళ్లాడు. దీన్ని అధికారులు CCTV కెమెరాల్లో గుర్తించారు. నిబంధనల ప్రకారం రెండున్నర లక్షల రూపాయలకు పైగా ఫైన్ కట్టాల్సిందేనని ఆదేశించడంతో అతడు షాక్ అయ్యాడు. తైవాన్ దేశంలోని కాహ్సియంగ్ ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. స్థానిక ప్రజారోగ్య విభాగానికి చెందిన అధికారులు ఫిలిప్పీన్స్‌ నుంచి వచ్చిన వలస కార్మికుడికి 1,00,000 తైవాన్ డాలర్లు ( అంటే మన కరెన్సీ లో సుమారు రూ.2,61,036 ) జరిమానా విధించారు. గత నెలలో తైవాన్‌కు వచ్చిన ఆ వ్యక్తిని హోటల్లో ఏర్పాటు చేసిన క్వారంటైన్ సెంటర్‌ కు తరలించారు. అతడు తన గది నుంచి బయటకు వచ్చి, కొన్ని సెకన్ల తరువాత మళ్లీ లోపలికి వెళ్లిపోయాడు. ఇది హోటల్ సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యింది. ఆ తరువాత అతడు తైవాన్ ఆరోగ్య శాఖ అధికారుల ముందు తప్పు ఒప్పుకున్నాడు. దీంతో నిబంధనల ప్రకారం వారు ఆ కార్మికుడికి భారీ జరిమానా విధించారు.