Begin typing your search above and press return to search.
ఇలాంటోడ్ని ఏం చేయాలి.. జల్సాలకు డబ్బులు ఇవ్వలేదని తల్లిని చంపాడు
By: Tupaki Desk | 10 Jan 2021 10:40 AM GMTనవమాసాలు మోసి కని పెంచిన కన్నతల్లిని దారుణంగా హతమార్చిన దారుణం హైదరాబాద్ లోని ఎస్ఆర్ నగర్ లో చోటు చేసుకుంది. పని పాటా లేకుండా జల్సాలు చేస్తూ.. తిరిగే కొడుకు.. విచక్షణ మరిచిన వైనం షాకింగ్ గా మారింది. ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బల్కంపేటలో చోటు చేసుకున్న ఈ దారుణంలోకి వెళితే..
కర్ణాటకకు చెందిన వీరప్ప.. సంగీతలకు ఐదుగురు పిల్లలు. గతంలో వారు నగరానికి వచ్చి ఇక్కడే ఉండిపోయారు. వీరప్ప వీధి వ్యాపారం చేస్తే.. సంగీత ఇళ్లల్లో పని చేస్తుండేది. ఇద్దరు కొడుకులు.. ఒక కుమార్తెకు పెళ్లి చేయగా.. చిన్న కొడుకు.. చిన్న కుమార్తెలు పెళ్లి కావాల్సి ఉంది. అనారోగ్యం బారిన పడిన వీరప్ప గత ఏడాది మరణించాడు. ఇంట్లో ఉన్న చిన్న కొడుకు ఎలాంటి బాధ్యత పట్టేది కాదు. పని చేసేవాడు కాదు. జులాయిగా తిరుగుతూ జల్సాలకు అలవాటు పడ్డాడు. డబ్బుల కోసం తల్లిని తరచూ వేధిస్తుండేవాడు. కొన్నిసార్లు కొట్టేవాడు కూడా.
ఇదిలా ఉంటే.. ఎప్పలానే శనివారం మధ్యాహ్నం ఇళ్లల్లో పని చేసి ఇంటికి వచ్చిన తల్లిని ఖర్చుల కోసం డబ్బులు అడిగాడు. ఆమె తన వద్ద లేవని చెప్పింది. దీంతో తల్లితో గొడవ పడ్డాడు. తాను ఎంత అడిగినా డబ్బులు ఇవ్వటం లేదన్న కోపంతో.. విచక్షణ మరిచి ఇంట్లో ఉన్న కూరగాయల కత్తితో పొడిచేశాడు. అదే పనిగా కత్తితో పొట్టను చీరేశాడు. దీంతో.. పేగులు కిందకు పడి కుప్పకూలిపోయింది. ఘటనాస్థలంలోనే కన్నుమూసింది.
ఇది చూసిన చిన్న కుమార్తె భయంతో వేరే గదిలోకి వెళ్లి తలుపు గడియ పెట్టుకుంది. తల్లీ కొడుకుల పెనుగులాట.. అరుపుల్ని విన్న ఇంటి పక్క వారు ఏదోజరుగుతుందన్న ఉద్దేశంతో ఇంటి వద్దకు వచ్చారు.తలుపు తీసే ప్రయత్నం చేశారు. ఇంతలో తల్లిని చంపిన కొడుకు ఇంట్లో నుంచి పారిపోయే ప్రయత్నం చేయగా.. స్థానికులు పట్టుకున్నారు. మరోవైపు.. సంగీత రక్తపు మడుగులో కుప్పకూలిపోయింది. కన్న కడుపును ఛిద్రంచేసిన కొడుకు తీరు షాకింగ్ గా మారింది. ఇలాంటోడ్ని ఏం చేసినా తప్పు లేదేమో?