Begin typing your search above and press return to search.
బెంగుళూరులో భార్యను..కోల్ కతాలో అత్తను చంపి ఆత్మహత్య !
By: Tupaki Desk | 24 Jun 2020 3:30 AM GMTభార్యభర్తలకు కుటుంబంలో వచ్చిన కలహాలు వారు విడాకులు తీసుకుని విడిపోయేదాకా వెళ్లింది. ఇది ఈ మధ్య రోజుల్లో కొత్త విషయం కాదు..కానీ, వారి విభేదాలు రెండు హత్యలకు కారణమయ్యాయి. ఓ కంపెనీలో చార్టెడ్ ఏకౌంటర్ గా పనిచేసే వ్యక్తి భార్యను అత్తను కాల్చి చంపేశాడు. ఆ తరువాత 10ఏళ్ల కొడుకుని అనాథగా వదిలేసి తాను కూడా ఆత్మహత్య చేసుకున్న దుర్ఘటనలు వెంట వెంటనే జరిగిపోయాయి.
ఈ ఘటన పై పూర్తీ వివరాలు చూస్తే.... అమిత్ అగర్వాల్ అనే వ్యక్తి బెంగళూరులో చార్టర్డ్ అకౌంటెంట్ గా పనిచేస్తున్నాడు.అతనికి భార్య శిల్పి ధంధనియాతో పాటు 10 ఏళ్ల కొడుకు ఉన్నారు. కొంతకాలంగా వీరి కాపురంల గొడవలు మొదలయ్యాయి. ఇక కలిసి బతకలేమని నిర్ణయానికి వచ్చిన ఇద్దరూ విడాకుల కోసం కోర్టుకెళ్లారు. ఈ నేపథ్యంలో బెంగళూరులో భార్య ఉంటోన్న ఇంట్లో ఆమెను హత్య చేశాడు. అనంతరం విమానంలో కోల్‌కతాలోని ఫూల్‌బాగన్ ప్రాంతంలో తమ అత్త, మామలు ఉంటోన్న ఫ్లాట్‌కు వెళ్లాడు.. అక్కడ వారిద్దరితో గొడవపడ్డాడు.
దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన అగర్వాల్ తుపాకీ తీసి తన అత్త లలితపై కాల్పులు జరిపాడు. అగర్వాల్ మామయ్య సుభాశ్ ఫ్లాట్ బయటకు పరుగులు తీసి బయటి నుంచి గడియ పెట్టి, ఇంటి పక్క వారిని సాయం కోరాడు. దీంతో వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆ ఫ్లాట్‌లో అత్తను చంపిన అనంతరం అగర్వాల్ కూడా తుపాకీతో కాల్చుకుని చనిపోయినట్లు పోలీసులు గుర్తించారు. అలాగే, ఆత్మహత్య లేఖను కూడా స్వాధీనం చేసుకున్నారు. తన భార్యను కూడా చంపేశానని అగర్వాల్ ఆత్మహత్య లేఖలో రాయడంతో బెంగళూరులోని పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు వెంటనే ఆమె ఇంటికి వెళ్లగా శిల్పి మృతదేహం లభ్యమైంది.