Begin typing your search above and press return to search.
ఇది నిరసన కాదు, పగ- కేజ్రీవాల్ పై కారం చల్లారు !
By: Tupaki Desk | 20 Nov 2018 12:06 PM GMTరాజకీయాల్లో దిగాక అన్ని పరిస్థితులకు, కఠిన పరీక్షలకు సిద్ధంగా ఉండాలి. లేకపోతే నిలబడటం కష్టం. సడెన్‌గా రాజకీయాల్లోకి వచ్చి సుడి పీక్స్‌లో ఉండి సీఎం పదవి దక్కించుకున్న కేజ్రీవాల్... జనం నుంచి ప్రేమా దక్కింది, ద్వేషమూ ఎదురవుతోంది. అయితే ఇంతకాలం చాలా చోట్ల రకరకాల నిరసనలు ఎదురయ్యాయి గాని... మరీ ఒక వ్యక్తి రెచ్చి ఏకంగా కారం చల్లారు. కారం చల్లడం నిరసన కాదు, పగ అవుతుంది. ఇవీ వివరాలు..
ఢిల్లీ నడిబొడ్డున ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి కార్యాలయంలోకి ఓ దుండగుడు ప్రవేశించాడు. సరిగ్గా మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో ముఖ్యమంత్రి కేజ్రీవాల్ భోజనానికి బయలుదేరుతారని తెలుసుకున్న నిందితుడు సీఎం చాంబర్ వద్ద ఉన్న ఓ గదిలో వెయిట్ చేస్తూ కూర్చున్నాడు. కేజ్రీవాల్ అతను కూర్చున్న చాంబర్‌లోకి రాగానే నిందితుడు కారం చల్లాడు. అసలు ఒక అనామకుడు హైసెక్యూరిటీ ఉన్న సీఎం గది వద్దకు వచ్చాడంటే... పోలీస్ వ్యవస్థ ఎంత దారుణంగా విఫలమైందో చెప్పడానికి ఇంతకు మించి ఉదాహరణ ఏం కావాలి? అని ఆప్ నేతలు ప్రశ్నించారు.
మేము విమర్శలు, పోరాటాలు అన్నిటికీ సిద్ధంగా ఉన్నాం. కానీ ఇది ప్రమాదకరమైన దాడి. దీనిని పోలీసులు ఆపలేకపోవడం వైచిత్రి. అసలు నిందితులకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అండ ఉంది. వారి ప్రోద్బలంతోనే ఈ దాడి జరిగింది. కావాలంటే... చూడండి, నిందితులకు కేంద్రమే భద్రత కూడా కల్పిస్తుంది అంటూ ఆప్ ఆరోపణలు చేసింది. ఈ సంఘటనతో కేంద్రం ఒక సందేశం ఇచ్చింది. అదేంటంటే... ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ పై అటాక్ చేయండి మేము పట్టించుకోం. అయితే, ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు ఈ సంఘటనను ఖండించారు. ఇలాంటి ఘటనలు గర్హనీయం అని అన్నారు.