Begin typing your search above and press return to search.
అజిత్ ధోవల్ ఇంట్లో వ్యక్తి హల్ చల్.. దూసుకెళ్లేందుకు యత్నం?
By: Tupaki Desk | 16 Feb 2022 11:31 AM GMTజాతీయ భద్రత సలహాదారు అజిత్ ధోవల్ నివాసం వద్ద కలకలం చెలరేగింది. ఓ గుర్తు తెలియని వ్యక్తి ఆయన ఇంట్లోకి చొరబడడానికి విఫల ప్రయత్నం చేశాడు. అతడి ప్రయత్నాలను పోలీసులు అడ్డుకున్నారు. అదుపులోకి తీసుకున్నారు. అతడి శరీరంలో ఎలక్ట్రానిక్ చిప్ ను అమర్చినట్లు తొలుత వార్తలు వచ్చాయి. ఈ చిప్ ద్వారా అతడిని తమ ఆధీనంలోకి తీసుకొని తాము చెప్పినట్లు చేసేలా కంట్రోల్ చేశారనే ప్రచారం సాగింది. పోలీసులు ఈ వార్తలను తోసిపుచ్చినట్లు తెలుస్తోంది.
అజిత్ ధోవల్ 5 జన్ పథ్ లో నివాసం ఉంటున్నాడు. భద్రతా కారణాల వల్ల ఆయన నివాసం వద్ద ఎలాంటి నేమ్ ప్లేట్ కూడా అమర్చలేదు పోలీసులు. అయినప్పటికీ ఆయన నివాసాన్ని గుర్తు పట్టాడు ఆగంతకుడు. ఈ ఉదయం 7.30-8 గంటల మధ్య అజిత్ ధోవల్ ఇంట్లోకి చొరబడడానికి తీవ్రంగా ప్రయత్నించాడు. అతడిని గుర్తించిన సెక్యూరిటీ అధికారులు అప్రమత్తం అయ్యారు. అదుపులోకి తీసుకున్నారు.
ఆ సమయంలో అతడు ఇష్టానుసారంగా ప్రవర్తించాడు. గట్టిగా కేకలు కూడా వేశాడు. తనను వదిలేయాలని.. అజిత్ ధోవల్ తో పని ఉందంటూ మొండికేశాడు. పిచ్చి పట్టినట్లు వ్యవహారించాడు. పోలీసులు అతడిని అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఆ ఆగంతకుడి పూర్వాపరాలను ఆరాతీశారు.
దర్యాప్తు అనంతరం అతడు ఓ అద్దెకారు డ్రైవర్ అని పోలీసులు నిర్ధారించారు. గుర్తు తెలియని వ్యక్తి శరీరంలో చిప్ ను అమర్చినట్లు వార్తలొచ్చాయి. ఆ చిప్ ద్వారా అతడి శరీరాన్ని కంట్రోల్ చేస్తున్నట్టు ప్రచారం సాగింది. అయితేదీన్ని పోలీసులు తోసిపుచ్చారు. అతడికి ఎంఆర్ఐ స్కానింగ్ నిర్వహించామని.. శరీరంలో ఎక్కడా.. ఎలాంటి చిప్ అమర్చినట్లు నిరూపితం కాలేదని ఢిల్లీ పోలీసులు పేర్కొన్నారు. ఆ వ్యక్తి స్వస్థలం బెంగళూరు అని విచారణలో తేలింది.