Begin typing your search above and press return to search.
రోడ్డు మీద నడుస్తున్న అతన్ని కారులో వచ్చి దారుణంగా నరికేశారు
By: Tupaki Desk | 16 Nov 2020 2:50 PM GMTపట్టపగలు.. నడి రోడ్డు మీద అందరూ చూస్తుండగా.. దారుణంగా హతమార్చిన ఉదంతం తమిళనాడులో చోటు చేసుకుంది. విన్నంతనే ఉలిక్కిపడటమేకాదు.. క్రైం సీన్ చూస్తే.. ఒళ్లు గగుర్పాటుకు గురి కావటం ఖాయం. అంతేకాదు.. కసాయి సైతం ఉలిక్కిపడేలా సాగిన ఈ మర్డర్.. ఇప్పుడు సంచలనంగా మారింది. తమిళనాడులోని మధురై నగరంలో చోటు చేసుకుంది.
ఊతంగడికి చెందిన 22 ఏళ్ల మురుగానందం తనస్నేహితుడితో కలిసి మధురై రోడ్ల మీద పడుస్తున్నారు. సెయింట్ మేరీస్ చర్చి దారి వెంట వెళుతున్న అతడ్ని.. కారులో నుంచి వచ్చిన గుర్తు తెలియని యువకులు అత్యంత దారుణంగా హతమార్చారు. దుండగులు దాడి చేసిన నేపథ్యంలో.. వారి నుంచి తప్పించుకునేందుకు పరుగులు తీశారు. అయినప్పటికి దాడి చేసేందుకు వచ్చిన వ్యక్తులు తమ టార్గెట్ ఏ మాత్రం మిస్ కాని రీతిలో మురుగానందాన్ని దారుణంగా హత్య చేశారు.
అది కూడా ఎంత పాశవికంగా అంటే.. అతడ్ని వెంటాడి మరి చంపేశారు. తొలుత మొండం నుంచి తలను వేరు చేశారు. తలను నరికి చర్చి ముందు పడేయగా.. బాడీని రోడ్డు మీద వదిలేసి వెళ్లిపోయారు. ఊహించని రీతిలో బాధితుడి తలను మరోచోట పడేసి వెల్లిపోయారు. దీంతో.. అక్కడి వారంతా ఉలిక్కిపడటమే కాదు.. ఈ హత్య సంచలనంగా మారింది. ఇంత దారుణంగా హతమార్చాల్సిన అవసరం ఏమిటి? ఎందుకు? అసలు కారణం ఏమిటి? లాంటి విషయాలు పోలీసుల విచారణలో బయటకు రానున్నాయి.