Begin typing your search above and press return to search.

కరోనాను కనిపెట్టే మాస్క్.. లాంచ్ చేసిన చైనా

By:  Tupaki Desk   |   22 Sep 2022 2:30 AM GMT
కరోనాను కనిపెట్టే మాస్క్.. లాంచ్ చేసిన చైనా
X
కరోనాను పుట్టించిన చైనా.. అది చాలదన్నట్టు ఇప్పుడు దాని రక్షణ కోసం ఉత్పత్తులు తయారు చేసి అమ్ముకొని సొమ్ము చేసుకునే పనిలో పడ్డారు. కరోనాను ప్రపంచానికి అంటించి లక్షల మంది ప్రాణాలు కోల్పోయేలా చేసిన చైనా ఎగమతులు, దిగుమతులపై చాలా దేశాలు పెదవి విరుస్తున్నాయి. కానీ ఆప్షన్ లేకపోవడంతో కొనాల్సి వస్తోంది. ఈ క్రమంలోనే కరోనాను కనిపెట్టే మాస్క్ ను తాజాగా చైనా ఆవిష్కరించడం హాట్ టాపిక్ గా మారింది.

మన చుట్టూ ఉండే వాతావరణంలో కరోనా సహా పలు రకాల వైరస్ ల ఉనికిని గుర్తించి అప్రమత్తం చేసే సరికొత్త వైర్ లెస్ మాస్క్ ను చైనా సైంటిస్టులు అభివృద్ధి చేశారు.

అప్టేమర్స్ అనే సింథటిక్ అణువులతో తయారు చేసిన ప్రత్యేక బయో సెన్సర్ ను మాస్క్ లో వారు పొందుపరిచారు. వాతావరణంలో కరోనా, ఇన్ ప్లుయెంజా వంటి వైరస్ లను అది కేవలం 10 నిమిషాల్లోనే నిర్ధారిస్తుంది. ఆ మాస్క్ ధరించిన వ్యక్తి ఫోన్ కు మెసేజ్ అందిస్తుంది.

ఇప్పటికే కరోనాను నిర్ధారించిన చైనా కనిపెట్టిన కిట్స్, వ్యాక్సిన్లు పెద్దగా ప్రభావితం చేయడం లేదని ప్రపంచవ్యాప్తంగా అపవాదు ఉంది. వ్యాక్సిన్ లు అయితే అస్సలు పనిచేయడం లేదని విమర్శలు ఉన్నాయి. ఇక కిట్స్ అయితే వైరస్ లేనివారికి వైరస్ వచ్చేలా చూపిస్తుందని అంటున్నారు.

మరి ఈ కరోనాను కనిపెట్టేమాస్క్ ఎలా పనిచేస్తుంది? అసలు పనిచేస్తుందా? లేదా? అన్నది వేచిచూడాలి. ఇప్పటికైతే సెన్సార్ల సాయంతో ఇది పనిచేస్తసుందని.. చిప్ ఉంటుందని అంటున్నారు. మరి వాటి వల్ల మనకు ఏమైనా హాని జరుగుతుందా? అన్నది మాత్రం చైనా శాస్త్రవేత్తలు బయటపెట్టలేదు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.