Begin typing your search above and press return to search.

భారతీయ హంతకుడి ఆచూకి చెబితే మిలియన్ డాలర్ల రివార్డ్!

By:  Tupaki Desk   |   3 Nov 2022 2:40 PM GMT
భారతీయ హంతకుడి ఆచూకి చెబితే మిలియన్ డాలర్ల రివార్డ్!
X
ఓ మహిళ హత్య కేసులో పరారీలో ఉన్న భారతీయుడి కోసం ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌లాండ్ రాష్ట్ర పోలీసు విభాగం చాలారోజులుగా వెతుకుతోంది. ఈ నేరం దాదాపు నాలుగేళ్ల క్రితం జరిగింది. ఈ హత్య కేసులో నిందితుడుగా 38 ఏళ్ల రాజ్‌విందర్ సింగ్ ఉన్నారు. ఆయన దొరకకపోవడంతో పోలీసులు చాలా రోజులుగా వెతుకుతున్నారు. దొరకకపోవడంతో తాజాగా భారీ రివార్డ్ ప్రకటించారు..

2018 అక్టోబరు 22న.. 24 ఏళ్ల టోయా కార్డింగ్లీ కైర్న్స్‌ దక్షిణ వంగెట్టి బీచ్‌లో శవమై కనిపించింది. రాజ్‌విందర్ సింగ్ ఈ కేసులో టోయాను చంపాడని పోలీసులు అనుమానించారు. అప్పటి నుంచి అతడు పరారీలో ఉన్నాడు. క్వీన్స్‌లాండ్ పోలీసులు నాటి నుంచి రాజ్ విందర్ కోసం వెతుకుతున్నారు.

టోయా హత్య జరిగిన ఒక రోజు తర్వాత రాజ్‌విందర్ కెయిర్న్స్ నుంచి సిడ్నీకి అటు నుంచి విమానంలో భారతదేశానికి వెళ్లాడు. రాజ్‌విందర్ సింగ్ ఆచూకీని కనుగొనడానికి ముగ్గురు క్వీన్స్‌లాండ్ పోలీసులు భారతదేశంలోకి వచ్చారు, అయితే అతను పట్టుబడినప్పటికీ, అతని అప్పగింత సమయం పడుతుంది. రాజ్‌విందర్‌ను వీలైనంత త్వరగా పట్టుకోవడానికి ఆస్ట్రేలియన్ పోలీసులు ఒక మిలియన్ ఆస్ట్రేలియన్ డాలర్ల భారీ నగదు బహుమతిని ప్రకటించారు. ఇది భారత కరెన్సీలో సుమారు రూ. 3.3 కోట్లు కావడం గమనార్హం.

ఇక నేరస్థుల అప్పగింతలో ఆస్ట్రేలియా - భారతదేశానికి సుదీర్ఘ చరిత్ర ఉంది. హిట్ అండ్ రన్ కేసులో నేరాన్ని అంగీకరించిన 33 ఏళ్ల భారతీయ జాతీయుడిని అప్పగించే ప్రక్రియను ఆస్ట్రేలియా జాప్యం చేయడంతో ఇప్పుడు రాజ్ విందర్ కేసులోనూ భారత ప్రభుత్వం ఆలస్యం చేస్తోంది. దీంతో ఆస్ట్రేలియా పోలీసులు నిందితుడిపై భారీ రివార్డ్ ప్రకటించి పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.