Begin typing your search above and press return to search.
నా హత్యకు ఓ మంత్రి కుట్ర పన్నారు: ఈటల సంచలన ఆరోపణ
By: Tupaki Desk | 19 July 2021 3:30 PM GMTఓ టీఆర్ఎస్ మంత్రిపై మాజీ మంత్రి ఈటల రాజేందర్ సంచలన ఆరోపణలు చేశారు. తన హత్యకు జిల్లాకు చెందిన ఓ మంత్రి కుట్ర పన్నారని సంచలన ఆరోపణలు చేశారు. హంతక ముఠాతో చేతులు కలిపినట్లు తనకు సమాచారం ఉందని పేర్కొన్నారు.
నరహంతక గ్యాంగ్ స్టర్ నయీం చంపుతానంటేనే తాను భయపడలేదని.. మీరెంత? అంటూ ఈటల ప్రశ్నించారు. ఇలాంటి చిల్లర ప్రయత్నాలకు తాను భయపడనని స్పష్టం చేశారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ లో సోమవారం 'ప్రజాదీవెన యాత్ర' పేరిట ప్రారంభించిన పాదయాత్రలో ఈటల రాజేందర్ చేసిన ఈ వ్యాఖ్యలు కలకలం రేపాయి.
'ఉగ్గుపాలతో ఉద్యమాలు చేసిన వాడిని.. ఈటల మల్లయ్య కొడుకుని ఆత్మగౌరవం కోసం ఏ స్థాయిలో అయినా కొట్లాడుతా.. దుబ్బాకలో ఏం జరిగిందో అదే హుజూరాబాద్ లో జరుగుతుంది.. 2018లో నన్ను ఓడించడానికి కుట్రలు చేసినా నా ప్రజలు అండగా నిలిచారు. ఇప్పుడు నిలుస్తారు.. చట్టం మీద నాకు విశ్వాసం ఉంది. పోలీసులు సహకరించండి' అని ఈటల రాజేందర్ తెలిపారు.
హుజూరాబాద్ ఉప ఎన్నికల నేపథ్యంలో తాజాగా ఈటల రాజేందర్ నియోజకవర్గంలో పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. నియోజకవర్గం అంతా పాదయాత్ర చేపట్టి ప్రజలను కలుసుకునే పనిలో పడ్డారు. టీఆర్ఎస్ మాయలో పడొద్దని.. తననే గెలిపించాలని కోరుతున్నారు.