Begin typing your search above and press return to search.
కొడుకు కోసం కిడ్నాపర్ల తో ఓ తల్లి వీరోచిత పోరాటం !
By: Tupaki Desk | 23 July 2020 11:10 AM GMTఈ ప్రపంచంలో తల్లిని మించిన యోధులు ఎవరు లేరు. ఇది మరోసారి రుజువైంది. సాధారణంగా కిడ్నాపర్లని చూస్తే భయంతో వణికిపోతారు , వారి దగ్గర ఉన్న ఆయుధాలతో చంపేస్తారేమో అని భయపడతారు. కానీ తాజాగా ఓ తల్లి తన కొడుకుని ఎత్తుకుపోతున్న కిడ్నాపర్ల పై ఆ రుద్రమదేవిలా వీరోచితంగా పోరాటం చేసింది. ఆ పోరులో కిడ్నాపర్లు ఆ పిల్లవాడిని అక్కడే వదిలేసి పారిపోవడానికి శతవిధాలా ప్రయత్నాలు చేసి చివరికి ఎలాగోలా పారిపోయారు . ఆ తరువాత వారిని పట్టుకొనేందుకు ఓ యువకుడు ప్రయత్నం చేశాడు. ఈ ఘటన ఢిల్లీలోని షకార్ పూర్ లో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన దృశ్యాలు అక్కడ ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. నీ ధైర్యానికి సలాం అమ్మ.. హాట్సాఫ్ మదర్..అంటూ నెటిజన్లు కామెంట్ పెడుతున్నారు.
ఢిల్లీలోని షకార్ పూర్ ఓ కుటుంబం నివాసం ఉంటోంది. వీరి ఇంట్లోకి కిడ్నాపర్ లు దూరి , చిన్నారిని కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలో తల్లి కూడా అక్కడే ఉంది. తల్లి అక్కడే ఉండగానే చిన్నారిని ఎత్తుకున్న బయటకు పరుగులు తీశాడు.
అప్పటికే బైక్ స్టార్ట్ చేసుకుని మరో కిడ్నాపర్ రెడీగా ఉన్నాడు. అమాంతం బైక్ పై ఎక్కిన వారు, ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించారు. ఒక్కసారిగా బయటకి వచ్చిన ఆ తల్లి వారిపై పడి తన కొడుకుని లాగేసుకొని , వారిని పట్టుకునే ప్రయత్నం చేసింది. ఓ కిడ్నాపర్ ఏమి తెలియనట్లుగా నడుచుకుంటూ ముందుకుపోగా ఇంకోతను బైక్ ను ముందుకు పోనిచ్చే ప్రయత్నం చేశాడు. కానీ..ఆ తల్లి గట్టిగా పట్టుకోవడంతో ముందుకు వెళ్లలేకపోయాడు. చివరకు బైక్ తో పారిపోయాడు. ఓ వ్యక్తి వాళ్లు వెళ్లకుండా…స్కూటర్ ను అడ్డుగా పెట్టాడు.
బైక్ పై వచ్చిన అతడిని నెట్టడంతో అమాంతం కిందపడిపోయాడు. మరొక వ్యక్తిని పట్టుకొనేందుకు ప్రయత్నించాడు. కానీ..అతడు పారిపోయాడు. కిందపడిపోయిన కిడ్నాపర్ తో ఫైటింగ్ చేసినా..ఫలితం లేకపోయింది. అతను కూడా పారిపోయాడు.