Begin typing your search above and press return to search.
'ఆమె' నుంచి నగ్నంగా వీడియో కాల్.. ఫోన్ ఎత్తాడు.. తర్వాత ఏం జరిగిందంటే
By: Tupaki Desk | 2 Aug 2022 11:30 PM GMTఆడవారి మాటలకు అర్ధాలే వేరులే.. అన్నారు సినీ కవి. కానీ, ఇప్పుడు ఆడవారి ఫోన్లకు కూడా అర్ధాలు మారిపోయాయి. మోసాలు బయటపడుతున్నాయి. అన్ని కాల్స్ మంచివి కాదు.. అన్నట్టుగా మారిపోయింది సీన్. సహజంగానే పురుష బుద్ధి ఏంటంటే.. మహిళ ఎవరైనా.. ఫోన్ చేస్తే.. లిఫ్టు చేయకుండా ఉండలేరు కదా! ఇక, నగ్నంగా వీడియో కాల్ చేస్తే.. ఇంకేముంది.. నక్కతొక్కాం.. అంటూ.. పోన్ లిఫ్ట్ చేసేస్తారు. కానీ, ఇక్కడే తేడా కొట్టింది ఓ యువకుడికి.. ఏం జరిగిందో చూడండి..
గుర్తు తెలియని వ్యక్తి నుంచి వచ్చిన వీడియో కాల్ ఆన్సర్ చేయడమే ఆ ఇంజినీర్ కొంపముంచింది. సైబర్ మోసగాళ్ల వలలో పడి రూ.25 లక్షలు పోగొట్టుకున్నాడు ఒడిశాకు చెందిన ఓ ఇంజినీర్. సమాజానికి భయపడి తొలుత మౌనంగా ఉండిపోయిన అతడు.. తనకు న్యాయం చేయాలంటూ ఇప్పుడు పోలీసుల చుట్టూ తిరుగుతున్నాడు.
బాధితుడు.. భువనేశ్వర్లో ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ అయిన బీఎస్ఎన్ఎల్లో ఇంజినీర్గా పనిచేస్తున్నాడు. కొద్దిరోజుల క్రితం అతడికి గుర్తు తెలియని నంబర్ నుంచి వాట్సాప్లో ఓ మెసేజ్ వచ్చింది. ఈ సందేశం ఎవరు పంపారా అని ఆలోచిస్తుండగానే వీడియో కాల్ వచ్చింది. ఆన్సర్ చేసి చూస్తే.. అవతలి వైపున ఓ మహిళ నగ్నంగా ఉంది. ఏవేవో కబుర్లు చెబుతోంది. వెంటనే కాల్ కట్ చేశాడు ఆ ఇంజినీర్.
అప్పటికే రికార్డ్ అయిన వాట్సాప్ వీడియో కాల్ను దోపిడీకి అస్త్రంగా మలుచుకున్నారు సైబర్ కేటుగాళ్లు. నగ్నంగా ఉన్న మహిళతో ఇంజినీర్ మాట్లాడుతున్న వీడియోను మార్ఫ్ చేశారు. రూ.25 లక్షలు ఇవ్వకపోతే ఆ వీడియోను వైరల్ చేస్తామని బెదిరించారు.
సమాజంలో తన ప్రతిష్ఠకు భంగం కలుగుతుందని భయపడిన ఇంజినీర్.. వారు అడిగిన డబ్బు సమర్పించుకున్నాడు. ఈ మొత్తం వ్యవహారంపై భువనేశ్వర్లోని సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు బాధితుడు. అతడు చెప్పిన వివరాల ఆధారంగా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
మన దగ్గర కూడా జరిగింది..
వాట్సాప్ న్యూడ్ కాల్స్తో సైబర్ మోసగాళ్లు లక్షల రూపాయలు గుంజుతున్న ఘటనలు ఇటీవల ఎక్కువైపోయాయి. ఇటీవల హైదరాబాద్ అశోక్‌నగర్‌లో ఉంటున్న ఒక వైద్యుడికి నేరుగా వాట్సాప్ కాల్ వచ్చింది. ఒక యువతి మాట్లాడింది. రెండ్రోజులు అలా సాగాక.. దుస్తులన్నీ తీసేసి మాట్లాడమంది. ఎవరూ లేరుకదా అని అతను నగ్నంగా మారి సంభాషించాడు. ఆ తర్వాత ఆ వీడియోలను అతడికి పంపారు. వీటన్నింటినీ మీ స్నేహితులకు పంపుతామంటూ బెదిరించగా రూ.15 లక్షలు నగదు బదిలీ చేసినట్లు పోలీసుల ముందు వాపోయాడు.