Begin typing your search above and press return to search.

వాళ్లు ఇచ్చేది లేద‌న్నారా? జ‌గ‌నే తెచ్చేది వ‌ద్ద‌న్నారా.. అప్పుల‌పై స‌రికొత్త వాదం!

By:  Tupaki Desk   |   3 Jan 2023 2:18 AM GMT
వాళ్లు ఇచ్చేది లేద‌న్నారా?   జ‌గ‌నే తెచ్చేది వ‌ద్ద‌న్నారా..  అప్పుల‌పై స‌రికొత్త వాదం!
X
ఏపీకి సంబంధించి మూడు వారాలు.. ప్ర‌త్యేకంగా చ‌ర్చ‌కు వ‌చ్చేవి. వారంలో ఏడు రోజులు ఉంటే.. వాటిలో మూడు వారాలు ప్ర‌త్యేకంగా.. ప్ర‌జ‌లపై ముద్ర వేశాయి. అవే.. ఒక‌టి సోమ‌వారం, రెండు మంగ‌ళ‌వారం, మూడు శుక్ర‌వారం. సోమ‌, శుక్రవారాలు.. టీడీపీ అధికారంలో ఉన్న‌ప్పుడు.. భారీ ఎత్తున ప్ర‌చారంలోకి వ‌చ్చేవి. సోమ‌వారం అంటే.. పోల‌వారంగా పేర్కొంటూ.. పోల‌వ‌రం ప్రాజెక్టును స‌మీక్షించేవారు.

శుక్ర‌వారం అంటే.. అప్ప‌టి విప‌క్ష నాయకుడిగా.. జ‌గ‌న్ త‌న కేసుల‌కు సంబంధించి సీబీఐ కోర్టుకు హాజ‌ర య్యేవారు. అప్ప‌ట్లో ఈ రెండు వారాల‌కు ప్రాధాన్యం ఉండేది. అయితే.. ఇప్పుడు మంగ‌ళ‌వారానికి ప్రాధాన్యం ఏర్ప‌డింది. వైసీపీ స‌ర్కారు పాల‌న‌లో మంగ‌ళ‌వారం రాగానే.. ఆర్థిక మంత్రి బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్ రెడ్డి.. ఆ శాఖ ఉన్న‌తాధికారులు కూడా.. ఆర్బీఐ నిర్వ‌హించే అప్పుల వేలంపాట‌లో పాల్గొంటారు.

దీంతో మంగ‌ళ‌వారం రాగానే.. 'ఏపీకి అప్పుల వారం'గా మారిపోయింది. ఇప్ప‌టి వ‌ర‌కు వివిధ సంస్థ‌ల‌ను.. ఆస్తుల‌ను, ప్ర‌భుత్వ స్థ‌లాల‌ను, ఆఖ‌రుకు మ‌ద్యంపై వ‌చ్చే 25 ఏళ్ల ఆదాయాన్ని కూడా చూపించి అప్పులు తెచ్చారు. అయితే..అనూహ్యంగా ఈ మంగ‌ళ‌వారం(జ‌న‌వ‌రి 3) మాత్రం ఆర్బీఐ నిర్వ‌హించిన వేలానికి ఏపీ దూరంగా ఉంది. ఎక్క‌డా ఏపీ ఊసు క‌నిపించ‌లేదు.

ఎప్పుడూ.. మంగ‌ళ‌వారం ఆర్బీఐ నిర్వ‌హించే స్టాక్స్ వేలంలో ముందుండే ఏపీ.. ఈసారి క‌నిపించ‌లేదు. తాజాగా ఆర్బీఐ ఇచ్చిన ప్ర‌క‌ట‌న ప్ర‌కారం.. 8 రాష్ట్రాలు ఈ వేలంలో పాల్గొన్నాయి. దీనికి కేంద్ర అనుమ‌తి అవ‌స‌రం. సో.. ఈ ర‌కంగా చూసుకుంటే.. కేంద్రం అనుమ‌తి ఇవ్వ‌లేదా?

లేక‌, ఏపీనే వ‌ద్ద‌నుకుందా? అనేది ఆస‌క్తిగా మారింది. ప్ర‌స్తుతం రిజ‌ర్వ్ బ్యాంకు ఇచ్చిన వేలం జాబితాలో త‌మిళ‌నాడు, గోవా, క‌ర్ణాటక రాష్ట్రాలు ఉన్నాయి త‌ప్ప‌..ఏపీకి స్థానం లేదు. మ‌రి దీనిని కేంద్ర‌మే వ‌ద్దందా.. లేక ఏపీనే దూరంగా ఉందా? అనేది తేలాల్సి ఉంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.