Begin typing your search above and press return to search.

విశాఖలో కరోనా కొత్త కేసు?

By:  Tupaki Desk   |   28 Dec 2022 8:31 AM GMT
విశాఖలో కరోనా కొత్త కేసు?
X
చైనాలో కొద్ది రోజులుగా కరోనా కొత్త వేరియంట్లు వెలుగు చూస్తున్నాయి. ఒమ్రికాన్.. బీఎఫ్ 7 వంటి వేరియంట్లు చైనాలో వేగంగా వ్యాప్తి చెందుతున్న విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలోనే చైనా చుట్టూరా ఉన్న దేశాలన్నీ కోవిడ్ పై మరోసారి అప్రమత్తం అవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం సైతం ఇప్పటికే అన్ని రాష్ట్రాల్లో ముందస్తు అప్రమత్తం చేసింది.

భారత్ ప్రస్తుతం కరోనాకు ముందు పరిస్థితులు నెలకొన్నాయి. దేశంలోని ప్రజలంతా సుమారు వ్యాక్సినేషన్ చేసుకోవడంలో కరోనా భయం భారత్ కు లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో వెలుగు చూస్తున్న కొత్త వేరియంట్లు మెల్లిగా భారత్ లోకి ప్రవేశిస్తున్నాయి. తాజాగా విశాఖలో ఓ వ్యక్తికి కరోనా కొత్త వేరియంట్ సోకిందనే ప్రచారం జోరుగా సాగుతోంది.

విశాఖకు చెందిన 33 ఏళ్ల ఓ వ్యక్తి ఇటీవల దుబాయ్ వెళ్లాడు. కొన్ని రోజులు అక్కడే ఉన్న సదరు వ్యక్తి ఈనెల 15న విశాఖకు తిరిగి వచ్చాడు. ఈ క్రమంలో అతడికి జ్వరం రావడంతో కుటుంబ సభ్యులు అతడిని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు అతడిని ఈనెల 16న ఆర్టీ పీసీఆర్ టెస్ట్ నిర్వహించగా అందులో పాజిటివ్ అని తేలింది.

ఆ శాంపిల్స్ ను సీసీఎంబీకి పంపించారు. ఆయనకు ఒమ్రికాన్ వేరియంట్ నిర్ధారణ అయినట్లు వెల్లడైందని తెలుస్తోంది. ప్రస్తుతం ఆ వ్యక్తిని వైద్యులు క్వారంటైన్ చేశారు.

దీంతో విశాఖ ప్రాంతంలో కరోనా కొత్త వేరియంట్ భయం మొదలైంది. కాగా మొన్నటి వరకు జీరో నెంబర్ కరోనా కేసులు ఉండగా నిన్న ఒకటి రెండు కొత్త కేసులు వెలుగుచూశాయి .

ఈ కొత్త రకం వేరియంట్ ఇదొకటేనని వైద్యులు చెబుతున్నారు. ప్రతిరోజు విశాఖ నుంచి రోజు ఇతర రాష్ట్రాలకు అనేక మంది పర్యాటకులు వస్తుంటారు. ఈ నేపథ్యంలోనే కరోనా కొత్త వేరియంట్ల వణుకు విశాఖలో మొదలైంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం సైతం కరోనా ముందస్తు చర్యలు తీసుకుంటోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.