Begin typing your search above and press return to search.
ఆ పువ్వుకు ప్రధాని మోదీ పేరు!
By: Tupaki Desk | 5 July 2017 7:51 AM GMTభారత ప్రధాని మోదీకి ఇజ్రాయెల్ పర్యటనలో అరుదైన గౌరవం దక్కింది. ఆ దేశానికి చెందిన ఓ పువ్వుకి ఏకంగా మోదీ పేరు పెట్టి తమకు భారత్ పట్ల, భారత ప్రధాని పట్ల ఉన్న అభిమానాన్ని ఇజ్రాయెల్ మరోసారి చాటుకుంది. 3 రోజుల పర్యటనలో భాగంగా మోదీ మంగళవారం ఇజ్రాయెల్ చేరుకున్న సంగతి తెలిసిందే. 70 ఏళ్లలో ఇజ్రాయెల్ లో పర్యటిస్తున్న తొలి భారత ప్రధానిగా మోదీ చరిత్ర సృష్టించారు.
ఈ చారిత్రక పర్యటన సందర్భంగా ఇజ్రాయెల్ లో ప్రసిద్ధిచెందిన క్రైసాంతిమమ్ పువ్వుకి ‘మోదీ’ పేరు పెట్టారు. ఈ విషయాన్ని ఇజ్రాయెల్ ప్రభుత్వం అధికారిక ట్విటర్ ద్వారా వెల్లడించింది. ఆ దేశ ప్రధాని బెంజమిన్ నేతన్యాహుతో కలిసి మోదీ‘డాంజిగర్’ పూలతోటను సందర్శించారు. డాంజిగర్ ఇజ్రాయెల్ లోనే అతిపెద్ద ఫ్లోరికల్చర్ కంపెనీ. దాదాపు 80,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ పూలతోట ఉంది. దీనిని 1963లో జెరూసలెంకి 56 కిమీల దూరంలో ఉన్న మోషావ్ మిష్మార్ హషివ ప్రాంతంలో కట్టించారు.
ఈ పర్యటన సందర్భంగా నెతన్యాహుకు ప్రధాని మోదీ కొన్ని విలువైన కానుకలు అందజేశారు. కొచ్చిన్ లో యూదుల చరిత్రను తెలిపే రాగిపలకల ప్రతిరూపం, భారత్ లోని యూదుల వ్యాపారాలను తెలిపే డాక్యుమెంట్ తో కూడిన రాగిపలకల ప్రతిరూపం వంటి అరుదైన కానుకలను ఇచ్చారు. వీటితో పాటు కేరళలోని పరదేశీ యూదుల సంఘం విరాళంగా ఇచ్చిన తోరా, బంగారంతో పూత పూసిన కిరీటాన్నినెతన్యాహుకు కానుకగా ఇచ్చారు.