Begin typing your search above and press return to search.

అధ్య‌క్షుడి వ్యాఖ్య: నా పెళ్లి మ‌ళ్లీ జ‌ర‌గ‌నుందేమో

By:  Tupaki Desk   |   21 Dec 2018 10:17 AM GMT
అధ్య‌క్షుడి వ్యాఖ్య: నా పెళ్లి మ‌ళ్లీ జ‌ర‌గ‌నుందేమో
X
ర‌ష్యా అధ్య‌క్షుడు వ్లాదిమిర్ పుతిన్ త‌న‌దైన శైలిలో వార్త‌ల్లో నిలిచే వ్య‌క్తి అనే సంగ‌తి తెలిసిందే. దేశాధ్య‌క్షుడిగా ఉంటూనే సోష‌లైట్‌ గా కూడా గ‌డిపేసే ఆయ‌న కొద్దికాలం క్రితం షార్ప్ షూటర్‌ గా త‌న‌లోని క‌ల‌ను బ‌య‌ట‌పెట్టిన సంగ‌తి తెలిసిందే. కలష్నికోవ్ కంపెనీ కొత్తగా ఓ స్నైపర్ రైఫిల్‌ను మార్కెట్లోకి తీసుకురానున్నది. అయితే మాస్కోలోని కలష్నికోవ్ షూటింగ్ రేంజ్‌కు వెళ్లిన పుతిన్.. అక్కడ స్నైపర్ రైఫిల్‌ ను టెస్ట్ చేశారు. కండ్ల అద్దాలు - ఇయర్‌ ఫోన్లు పెట్టుకుని ఆయన సుమారు అయిదు రౌండ్ల కాల్పులు జరిపారు. ఓ ప్రొఫెషనల్ స్నైపర్ తరహాలో పుతిన్ ట్రిగ్గర్ నొక్కినట్లు అధికారులు చెప్పారు. ఇలా వార్త‌ల్లో నిలిచిన పుతిన్ రెండో పెళ్లి ఎపిసోడ్‌ తో మ‌ళ్లీ తెర‌మీద‌కు వ‌చ్చారు.

ఔను. పుతిన్‌ మ‌ళ్లీ పెళ్లి చేసుకోనున్నారు. అయితే ఎవ‌ర్ని పెళ్లి చేసుకుంటార‌న్న విష‌యాన్ని మాత్రం ఆయ‌న వెల్ల‌డించ‌లేదు. ఓ గౌర‌వ‌ప్ర‌ద‌మైన వ్య‌క్తిగా - ఏదో ఒక రోజు పెళ్లి చేసుకునే అవ‌కాశం ఉంద‌ని పుతిన్ అన్నారు. పుతిన్ 1983లో లుద్‌ మిలా పుతినాను పెళ్లి చేసుకున్నారు. ఆమెకు ఆయ‌న 2013లో విడాకులు ఇచ్చారు. ఆ జంట‌కు క‌త్రినా, మారియా కూతుళ్లు ఉన్నారు. ఆ ఇద్ద‌రూ రాజ‌కీయాల‌కు దూరంగా ఉన్నారు. లుద్‌ మిలాకు డైవ‌ర్స్ ఇచ్చిన త‌ర్వాత‌.. పుతిన్ ప‌ర్స‌న‌ల్ లైఫ్‌ పై అంద‌రికీ ఆస‌క్తి పెరిగింది. ఇటీవ‌ల మాజీ ఒలింపిక్ జిమ్నాస్ట్ అలినా క‌బేవాతో పుతిన్ డేటింగ్ చేస్తున్న‌ట్లు ఓ ర‌ష్యా ప‌త్రిక వెల్ల‌డించింది.