Begin typing your search above and press return to search.

కాశ్మీర్లో కొత్త టెర్రరిస్టుల గ్రూపు

By:  Tupaki Desk   |   20 July 2022 12:00 PM IST
కాశ్మీర్లో కొత్త టెర్రరిస్టుల గ్రూపు
X
జమ్మూ-కాశ్మీర్ రాష్ట్రంలో అల్లకల్లోలం చేయటానికి కొత్తగా మరో ఉగ్ర గ్రూపు రెడీ అయ్యింది. ఎలాగైనా భారత్ ఆధీనంలో ఉన్న భూతల స్వర్గంలాంటి రాష్ట్రాన్ని నాశనం చేయటమే టార్గెట్ గా పెట్టుకున్న అనేక ఉగ్రవాద గ్రూపుల్లోని నుండి బయటకు వచ్చేసిన కొందరు కలిసి కొత్తగా ఇస్లామిక్ స్టేట్ ఇన్ విలయ్యాహ్ హింద్ ( ఐఎస్ హెచ్ఓ) అనే గ్రూపుగా ఏర్పడింది. దీన్ని పాకిస్ధాన్ ఇంటెలిజెన్స్ ఐఎస్ఐ ఏర్పాటుచేసినట్లు ఐఎస్ఐ మాజీ ఉన్నతాధికారే స్వయంగా ప్రకటించారు.

మిషన్ కాశ్మీర్ ను యాక్టివ్ చేసేందుకే వివిధ ఉగ్రవాద గ్రూపులు లష్కరే తోయిబా, జైష్ ఏ మహమ్మద్, తహ్రీక్ ఏ తాలిబాన్ పాకిస్ధాన్ గ్రూపులన్నీ కలిపి కొత్తగా ఎఎస్ హెచ్ ఓని ఏర్పాటు చేసిందట.

కాశ్మీర్లో అల్లకల్లోలం సృష్టించటమే పాత, కొత్త గ్రూపుల ఏకైక లక్ష్యంగా వ్యవహారాలు సాగుతున్నాయి. దాయాది దేశం పాకిస్ధాన్ నుండే కాకుండా ఆఫ్ఘనిస్ధాన్ నుండి కూడా ఇపుడు ఉగ్రవాదులు, తీవ్రవాదులు కాశ్మీర్లోకి ప్రవేవించేందుకు విపరీతంగా ప్రయత్నిస్తున్నారు.

ఏదో రూపంలో కాశ్మీర్లోకి ప్రవేశించేయటం, కొంతకాలం షెల్టర్ తీసుకోవటం తర్వాత కాశ్మీర్లోని పౌరులు, లేదా మిలిట్రీ మీదకు దాడులు చేస్తున్నారు. మారణహోమాన్ని సృష్టించి స్ధానికులను ప్రత్యేకించి పండిట్లను కాశ్మీర్ లోయలో నుండి తరిమేయటమే టార్గెట్ గా వందలమంది తీవ్రవాదులు దాడులుచేస్తున్నారు. కాశ్మీర్-జమ్మూలోని ఒక సామాజికవర్గానికి చెందిన అమ్మాయిలను పాకిస్ధాన్ నుండి చొరబడిన యువకులు వివాహాలు చేసుకుంటున్నారు. ఎలాగో ఆధార్ కార్డులను లోకల్ ఐడెంటిని సంపాదించుకుంటున్నారు.

దొంగదారుల్లో సదరు యువకులు కూడా స్ధానికులైపోతున్నారు. దీని ద్వారా కేంద్రం అమలుచేస్తున్న సంక్షేమపథకాల్లో లబ్దిదారులవుతున్నారు. దీంతో ఎవరికీ ఇలాంటి యువకులపై అనుమానాలు రావటంలేదు. ఉద్యోగాలు, వ్యాపారాల్లో స్ధిరపడిన తర్వాత హఠాత్తుగా ఇతరులపై దాడులకు తెగబడి మారణహోమానికి పాల్పడుతున్నారు.

ఎప్పుడైతే మారణహోమానికి పాల్పడ్డారో అవకాశముంటే మళ్ళీ పాకిస్ధానలోకి వెళ్ళిపోతున్నారు లేదంటే భద్రతా బలగాల ఎదురుకాల్పుల్లో చనిపోతున్నారు. మరి కొత్తగా ఏర్పడిన గ్రూపును ప్రభుత్వం ఎలా ఎదుర్కొంటుందో చూడాల్సిందే.