Begin typing your search above and press return to search.
చైనాను బెంబేలెత్తిస్తున్న కొత్త వైరస్!
By: Tupaki Desk | 10 Aug 2022 9:44 AM GMTకోవిడ్ పుట్టినిల్లు చైనాను మరో వైరస్ ప్రస్తుతం బెంబేలెత్తిస్తోంది. దీనికి లాంగ్యా హెనిపా వైరస్ గా వైద్యులు గుర్తించారు. ఇది జంతువుల నుంచి మనుషులకు వ్యాపిస్తుందని చెబుతున్నారు.
తూర్పు చైనాలోని హెనాన్, షాన్‌డాంగ్ ప్రావిన్సుల్లో ఇప్పటివరకు 35 మందికి ఈ వైరస్ సోకినట్లు సమాచారం. జర్వంతో బాధపడుతున్న రోగుల గొంతు నుంచి సేకరించిన నమూనాల్లో లాంగ్యా వైరస్‌ను వైద్యులు గుర్తించారు.
ఈ వైరస్ తీవ్రమైన ఇన్ఫెక్షన్ కలిగిస్తుందని చెబుతున్నారు. మనుషుల్లో మూడో వంతు మంది ప్రాణాలను తీయగలదని అంటున్నారు. అయితే కొత్త కేసులు ఏవీ ప్రాణాంతకమైనవి కావని చెబుతున్నారు. ఈ 35 మందిలో చాలామంది తేలికపాటి, ఫ్లూ లాంటి లక్షణాలను ఎదుర్కొంటున్నారు.
ఈ వైరస్ జంతువుల నుండి మానవులకు వ్యాపిస్తుందని వైద్యులు చెబుతున్నారు. మూత్రపిండాలు, కాలేయ వైఫల్యానికి కారణమవుతోందని పేర్కొంటున్నారు.
అయితే ఇప్పటివరకు నమోదైన కేసుల్లో ఎలాంటి మరణం సంభవించలేదని వైద్యులు చెబుతున్నారు. అంతేగాక ఈ వైరస్ బారిన పడిన వారిలో కేవలం స్వల్ప లక్షణాలు మాత్రమే కనిపిస్తున్నాయని అంటున్నారు. వైరస్ సోకినవారు ఫ్లూ వంటి లక్షణాలతో బాధపడుతున్నారు. లాంగ్యా వైరస్‌కు ఇప్పటి వరకూ వ్యాక్సిన్ అందుబాటులో లేదు. దాని లక్షణాలు, సమస్యల ఆధారంగానే చికిత్స అందిస్తున్నారు.
సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (సీడీసీ) ఈ లాంగ్యా హెనిపా వైరస్ జీనోమ్ సీక్వెన్సింగ్ ను తేల్చడానికి పరిశోధనలు చేస్తోంది. అలాగే చైనాలో ప్రయోగశాలలను బలోపేతం చేస్తోందని వార్తలు వస్తున్నాయి. అలాగే టీకా తయారీకి పరిశోధనలను ప్రారంభించిందని చెబుతున్నారు.
కాగా హెపా వైరస్ సోకినవారిలో 26 మంది జ్వరం, 54% మంది అలసట, 50% మంది దగ్గు, 38% మంది వికారంగా ఉందని వైద్యులకు తెలిపారు. అలాగే, మొత్తం 26 మందిలో 35% మంది తలనొప్పి, వాంతులు ఉన్నాయన్నారు. 35% మందికి కాలేయం పనితీరు మందగించింది, 8% మంది మూత్రపిండాల పనితీరు ప్రభావితమైందని వైద్య పరీక్షల్లో తేలింది. అలాగే తెల్లరక్త కణాల సంఖ్య తగ్గడం కూడా కనిపించిందని చెబుతున్నారు.