Begin typing your search above and press return to search.
యూకేలో ఒక్కరోజే 42 వేల కొత్త కేసులు ..మరో కొత్త వేవ్ ప్రారంభం అయిందా !
By: Tupaki Desk | 15 July 2021 7:30 AM GMTయునైటెడ్ కింగ్ డమ్ లో కరోనా వైరస్ మహమ్మారి మరోమారు విజృంభిస్తోంది. గతంలో కరోనా మహమ్మారి కట్టడికి విధించిన లాక్ డౌన్ , కర్ఫ్యూ నుండి సడలింపులు పరకటించడం మొదలు పెట్టిన తర్వాత కరోనా మహమ్మారి పాజిటివ్ కేసులు కొంచెం కొంచెంగా పెరుగుతున్నాయి. లాక్ డౌన్ సడలింపులు ప్రకటించడం మొదలు పెట్టిన తరువాత ఇక జూన్ 21 నుంచి పూర్తిగా ఆంక్షలు ఎత్తివేయాలని నిర్ణయించారు,
అయితే, పరిస్థితి కుదుట పడక పోవడంతో ఆంక్షలను జూలై 19 వరకూ పొడిగించారు. ఈ సందర్భంగా లాక్డౌన్ సడలింపు యొక్క చివరి దశ తర్వాత కూడా ఇంగ్లాండ్ ను కరోనావైరస్ నుండి రక్షించడానికి చాలా జాగ్రత్తలు అవసరం అని ప్రధాని బోరిస్ జాన్సన్ చెప్పారు.
రాబోయే కొద్ది రోజులలో” ఏమి జరుగుతుందో చెప్పలేమని ఆయన తెలిపారు. డెల్టా వేరియంట్ ద్వారా పెరుగుతున్న కేసుల కారణంగా ఆంక్షలను ఎత్తివేయడం జూలై 19 వరకు వాయిదా పడినా కరోనా కేసులు ఇంకా పెరుగుతున్నాయి.
యునైటెడ్ కింగ్ డమ్ లో బుధవారం మరో 42,302 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. జనవరి 15 తరువాత ఒక్కరోజులో ఈ స్థాయిలో కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. అంతే కాకుండా వైరస్ పాజిటివ్ వచ్చిన వారిలో 49 మరణాలు నమోదు అయ్యాయి. దీంతో యూకే అంతటా ఆందోళన నెలకొంది. లాక్ డౌన్ ఆంక్షలు ఉండగానే ఒక్కసారిగా కేసుల సంఖ్య పెరగడం ఆందోళన రేకెత్తిస్తోంది.
మునుపటి మహమ్మారి పాజిటివ్ కేసుల కంటే ఈ పాజిటివ్ కేసులు , మరణాల సంఖ్య చాలా తక్కువగా ఉన్నప్పటికీ, మే చివరి నుండి బ్రిటన్ కేసులు పెరుగుతున్నాయి. మంగళవారం నమోదైన 36,660 తో పోలిస్తే బుధవారం 42,302 మంది ఉన్నారు. సామాజిక సంబంధాలపై మిగిలిన అన్ని ఆంక్షలను ఎత్తివేయడానికి ఇంగ్లాండ్ సోమవారం సన్నాహాలు చేస్తున్న సమయంలో ఈ రేంజ్ లో కేసులు నమోదు కావడంతో ప్రభుత్వం కూడా ఆలోచనలో పడింది.
మరో ముఖ్యమైన విషయం ప్రస్తుతం బ్రిటన్ లో యూరో 2020 ఫుట్‌బాల్ టోర్నమెంట్ జరుగుతోంది. ఈ టోర్నమెంట్ కూడా కరోనా ఇన్ ఫెక్షన్లకు మరింతగా ఆజ్యం పోస్తాయనే అనుమానం వ్యక్తం చేస్తుంది.
ఈ సమయంలో, మహమ్మారిని నియంత్రించే ప్రయత్నాలలో ప్రజా, జాతీయ ప్రభుత్వాలు క్రమశిక్షణతో ఉండకపోతే యూరప్ అనివార్యంగా కరోనా వైరస్ సంక్రమణల కొత్త వేవ్ ఎదుర్కొంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది.
ఇకపోతే ,మనదేశంలో కూడా కరోనా వైరస్ యాక్టివ్ కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతోంది. గత ఇరవై నాలుగు గంటల్లో దేశ వ్యాప్తంగా కలిసి దాదాపు రెండు వేలకు పైగా యాక్టివ్ కేసులు పెరిగాయి. ప్రస్తుతం దేశంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 4.32 లక్షలుగా ఉంది. యాక్టివ్ కేసుల సంఖ్య తగ్గాల్సిన దశలో మళ్లీ పెరిగిపోతుండటం గమనార్హం. రాష్ట్రాల వారీగా చూస్తే.. కొన్ని రాష్ట్రాల్లో మళ్లీ కేసుల సంఖ్య భారీ స్థాయికి చేరుతూ ఉండటం గమనార్హం.
కేరళలో గత ఇరవై నాలుగు గంటల్లో నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 15 వేలకి పైగానే ఉన్నాయి. ప్రస్తుతం కేరళలో యాక్టివ్ కేసుల సంఖ్య 1.18 లక్షలుగా ఉంది. అలాగే మహారాష్ట్రలో కూడా యాక్టివ్ కేసుల సంఖ్య స్వల్పంగా పెరిగింది. గత ఇరవైనాలుగు గంటల్లో రెండు వేలకు పైగా యాక్టివ్ కేసుల సంఖ్య పెరిగింది. ప్రస్తుతం అక్కడ లక్షకు పైగా కరోనా యాక్టివ్ కేసులున్నాయి.
కర్ణాటక, తమిళనాడు, ఏపీల్లో కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖంలోనే కొనసాగుతుంది. కర్ణాటకలో యాక్టివ్ కేసుల సంఖ్య బాగా తగ్గింది. ఒక దశలో దేశంలోనే అత్యధిక స్థాయిలో యాక్టివ్ కేసులు నమోదైన రాష్ట్రం కర్ణాటక. ఐదు లక్షలకి పైగా యాక్టీవ్ కేసులు కర్ణాటక లో నమోదు అయ్యాయి. ప్రస్తుతం కర్ణాటక లో యాక్టివ్ కేసుల సంఖ్య ముప్పై వేల స్థాయిలో ఉంది. తమిళనాడులో కూడా ముప్పై వేల స్థాయిలో మాత్రమే యాక్టివ్ కేసులున్నాయి. ఏపీలో యాక్టివ్ కేసుల సంఖ్య 25 వేల వరకూ ఉంది. రోజువారీ కేసుల నమోదు విషయంలో కూడా ఈ మూడు రాష్ట్రాల్లో తగ్గుతూ వస్తున్నాయి.
శంలో కరోనా కేసుల సంఖ్య మళ్లీ స్వల్పంగా పెరిగింది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 41,806 కరోనా కేసులు నమోదవ్వగా 581 మరణాలు చోటుచేసుకున్నాయి. ఈ మేరకు కేంద్రవైద్యారోగ్యశాఖ గురువారం కోవిడ్‌పై హెల్త్‌బులిటెన్ విడుదల చేసింది.తాజా కేసులతో కలిపి దేశంలో కరోనా సోకిన వారి సంఖ్య మొత్తం 3,09,87, 880గా ఉంది. ఇక కరోనాతో మృతి చెందినవారి సంఖ్య 4,11,989కి చేరింది.
ఒక్కరోజులో కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జి అయిన వారి సంఖ్య 39,130 మంది కాగా.. దీని ప్రకారం ఇప్పటి వరకు మొత్తంగా 3,01,43,850 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. దేశంలో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 4,32,041గా ఉంది