Begin typing your search above and press return to search.
అడుక్కునే పరిస్థితిలో అణ్వస్త్ర దేశం!
By: Tupaki Desk | 16 Jan 2023 7:52 AM GMTమన పొరుగు దేశం శ్రీలంక ఆర్థిక సంక్షోభాన్ని మరిచిపోకముందే మరో పొరుగు దేశం పాకిస్థాన్ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంది. కిలో గోధుమ పిండి రూ.240కు చేరింది. రేషన్ దుకాణాల ఎదుట గోధుమ పిండి కోసం పాకిస్థాన్ ప్రజలు బారులు తీరుతున్నారు. మరోవైపు విదేశీ మారక ద్రవ్య నిల్వలు పూర్తిగా అడుగంటాయి.
అమెరికా, ముస్లిం దేశాలు ఇతోధిక సాయం చేస్తున్నా పాకిస్థాన్ ఇంకా సుడిగుండంలోనే ఉంది. ఇటీవల కాలంలో విపరీతంగా పెరిగిన ఉష్ణోగత్రలు, అనుకోని వరదలు ఆ దేశ పుట్టి ముంచాయి. వరదలతో సగానికి పైగా జనాభా అప్పట్లో వరదల్లోనే చిక్కుకున్న సంగతి తెలిసిందే. దీంతో గోధుమ పంట మొత్తం వరదకు తుడిచిపెట్టుకుపోయింది. గోధుమలపైనే పూర్తిగా ఆధారపడ్డ పాకిస్థాన్ కు ఇది అశనిపాతంగా పరిణమించింది. దీంతో గోధుమలకు తీవ్ర కొరత ఏర్పడింది.
ఈ నేపథ్యంలో పాక్ ఆర్థిక సంక్షోభంతో అట్టుడుకుతోంది. ఈ క్రమంలో దేశ దుస్థితిపై పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అణ్వస్త్ర దేశమైన పాకిస్థాన్ అప్పుల కోసం అడుక్కోవాల్సి రావడంపై ఆందోళన వ్యక్తం చేశారు. రుణాల విషయమై మాట్లాడుతూ.. ఒక అణ్వస్త్ర అడుక్కోవాల్సి రావడం సిగ్గుచేటని షెహబాజ్ షరీప్ వ్యాఖ్యానించారు. కాగా రుణాల విషయంలో మిత్రదేశాలు కూడా మమ్మల్ని బిచ్చగాళ్లలా చూస్తున్నాయని షెహబాజ్ షరీఫ్ గతంలోనూ ఓసారి ఆవేదన వ్యక్తం చేయడం గమనార్హం.
పాకిస్థాన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ప్రొబేషనరీ అధికారుల పాసింగ్ అవుట్ కార్యక్రమంలో భాగంగా పాక్ ప్రధాని షెహబాజ్ ఈ మేరకు సంచలన వ్యాఖ్యలు చేశారు. మరిన్ని రుణాల కోసం ఇతర దేశాలపై ఆధారపడటం తనకు ఇబ్బందిగా అనిపించిందని చెప్పారు. దేశ ఆర్థిక సవాళ్లను ఎదుర్కొనేందుకు విదేశీ రుణాలు సరైన పరిష్కారం కాదని షెహబాజ్ వ్యాఖ్యానించారు. వేరే దేశాల నుంచి తెచ్చిన రుణాలను తిరిగి మళ్లీ చెల్లించాల్సి ఉంటుందని షెహబాజ్ ఆందోళన వ్యక్తం చేశారు.
పాక్ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకోవడంతో విదేశీ మారక ద్రవ్య నిల్వలు 4.3 బిలియన్ డాలర్లకు అడుగంటాయి. గత తొమ్మిదేళ్లలో పాక్ విదేశీ మారక ద్రవ్య నిల్వలు ఇదే అత్యల్పం ఇదే కావడం గమనార్హం.
అలాగే పాక్ వద్ద ఉన్న డాలర్లు సైతం 10 బిలియన్ డాలర్లకు పడిపోయాయి. ఈ క్రమంలో డాలర్లను కాపాడుకొనేందుకు పాక్ అనేక చర్యలను చేపట్టింది. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) నుంచి సాయం అందే వరకు అదనపు డిపాజిట్ల కోసం మిత్ర దేశాలతో పాక్ సంప్రదింపులు జరుపుతోంది. ముఖ్యంగా సౌదీ అరేబియాతో సంప్రదింçపులను పాక్ ముమ్మరం చేసింది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.