Begin typing your search above and press return to search.
ఘరానా మోసం: స్కీమ్ పేరుతో 50 కోట్లు నొక్కేశాడు
By: Tupaki Desk | 13 Nov 2020 5:30 PM GMTఒక్కసారి డబ్బులు కడితే చాలు.. జీవితాంతం ఆదాయం అంటూ జనాలను నమ్మించి కుచ్చుటోపీ పెట్టాడు ఓ ఘరానా మోసగాడు. చివరకు ఆ స్కీమ్ బోగస్ అని తెలిసేసరికి డబ్బులు కట్టిన జనాలు లబోదిబోమన్నారు. ఆంధ్రప్రదేశ్ లో వెలుగుచూసిన ఈ బోగస్ స్కామ్ ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా సంచలనమైంది.
చిత్తూరు జిల్లా చెరువు కిందపల్లికి చెందిన రూపేష్ కుమార్ (29) అనే యువకుడు ఒక కొత్త పింఛన్ స్కీమ్ ను ప్రారంభించినట్లుగా కొద్ది నెలల కిందట గ్రామంలో ప్రచారం చేశాడు. ఒక వ్యక్తి ఒక్కసారి 12500 కడితే జీవితాంతం ప్రతినెల రూ.3వేలు పింఛన్ గా అందుతుందని చెప్పాడు. తెలిసినవాడే కదా అని వందలాది మంది డబ్బులు చెల్లించారు. వారికి ప్రామిసరీ నోట్లు చేతిలో పెట్టాడు. డబ్బులు చెల్లించిన వారికి మూడు నెలల పాటు ప్రతీనెలా రూ.3వేలు చెల్లించాడు. గ్రామస్థులకు నమ్మకం ఏర్పడడంతో తమ బంధువులు, తెలిసినవాళ్లకు చెప్పి రూపేష్ పింఛన్ స్కీమ్ లో చేర్పించారు.
రూపేష్ స్కీమ్ క్రమంగా కడప, అనంతపురం, కర్ణాటకకు విస్తరించింది. దాదాపు 45వేల మంది డబ్బులు కట్టారు 50 కోట్ల వరకు వసూలు చేసిన రూపేష్ ఇప్పుడు పత్తా లేకుండా పోయాడు. దీంతో డబ్బులు చెల్లించిన వారంతా గగ్గోలు పెడుతున్నారు.
బంధువులతో డబ్బులు కట్టించిన వారు ఇప్పుడు వారిపై పడి తమకు సొమ్ము చెల్లించాలని కోరుతున్నారు. దీంతో రూపేష్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు అతడిని పెద్దమాండ్యం వద్ద అరెస్ట్ చేశారు. అయితే కానిస్టేబుళ్ల నిర్లక్ష్యంతో అతడు పరారయ్యాడు. రూపేష్ కోసం ఇప్పుడు పోలీసులు గాలిస్తున్నారు.