Begin typing your search above and press return to search.

పెళ్లికార్డు తీసుకెళ్లి రూ.2.5లక్షలు ఇవ్వమన్నాడు

By:  Tupaki Desk   |   25 Nov 2016 7:33 AM GMT
పెళ్లికార్డు తీసుకెళ్లి రూ.2.5లక్షలు ఇవ్వమన్నాడు
X
నోట్ల రద్దుతో దేశ వ్యాప్తంగా చోటు చేసుకుంటున్న పరిణామాల సంగతి తెలిసిందే. కరెన్సీ నోట్ల కోసం జనాలు పడుతున్న తిప్పలు అన్నిఇన్ని కావు. చేతిలో ఉన్న పెద్దనోట్లను మార్చుకోవటం.. డిపాజిట్ చేయటం.. ఏటీఎంలలో డ్రా చేసుకోవటం.. బ్యాంకులకు వెళ్లి విత్ డ్రా చేసుకోవటం లాంటి ఎన్నో అవసరాలకు ఇప్పుడు కేరాఫ్ అడ్రస్ గా మారాయి బ్యాంకులు. నిన్న మొన్నటి వరకూ లైట్ తీసుకున్న బ్యాంకులు ఇప్పుడు నిత్యవసరంగా మారిపోయాయి.

పొద్దున్నే లేచిన వెంటనే బ్యాంకులు.. ఏటీఎం సెంటర్లు గుర్తుకు రావటం.. పరుగులు తీయటం ఇప్పుడో అలవాటుగా మారింది. ఎక్కడికైనా వెళ్లాలన్నా.. ఊరికి వెళ్లాలన్న ప్లాన్ చేసుకోవటం పాత మాటగా మారి.. బ్యాంకుల నుంచి డబ్బులు ఎలా తెచ్చుకోవాలి? అన్న దానికిప్పుడు ప్రత్యేకంగా ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం వచ్చేసింది. ఇదిలా ఉంటే.. నోట్ల రద్దు నేపథ్యంలో ఎవరింట్లోఅయినా పెళ్లి జరుగుతున్నప్పుడు తమ ఖాతాల్లోని మొత్తంలో ఒకేసారి రూ.2.5లక్షలు తీసుకోవటానికి అవకాశం కల్పిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకోవటం తెలిసిందే.

అయితే.. దీన్ని తప్పుగా చేసుకున్న ఒకరు బ్యాంకుకు వెళ్లి చేసిన హడావుడితో బ్యాంకు అధికారులకు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యేలా చేసింది. బ్యాంకు సిబ్బంది ఎంత చెబుతున్నావినకుండా సదరు వ్యక్తి చేసిన హడావుడితో..ఏం చేయాలో తోచని పరిస్థితి నెలకొంది. హైదరాబాద్ కు చెందిన ఒక బస్తీవాసి బ్యాంకుకు వెళ్లి.. తమ ఇంట్లో జరిగే పెళ్లికి సంబంధించిన శుభలేఖ చూపించి.. తనకు రూ.2.5లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారట. పెళ్లి కార్డు తీసుకొచ్చిన నేపథ్యంలో బ్యాంకులో ఖాతా ఉందంటే.. లేదని బదులిచ్చిన సదరు వ్యక్తి.. పెళ్లికార్డు చూపిస్తే రూ.2.5లక్షలు ఇస్తున్నారట కదా? అంటూ అమాయకంగా అడుతున్న వైనం అక్కడున్న వారిని అవాక్కు అయ్యేలా చేసింది. తమ ఖాతాలో ఉన్న డబ్బును విత్ డ్రా చేసుకోవటానికి గంటల తరబడి క్యూలో ఉన్న వారు ఈ ఉదంతాన్ని చూసుకొని తమ టెన్షన్ ను మర్చిపోయి నవ్వేస్తున్నారట.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/