Begin typing your search above and press return to search.
సుర్రుమనే సూరీడు.. ఫక్కుమని నవ్వాడు..
By: Tupaki Desk | 31 Oct 2022 4:30 PM GMTచల్లని చూపుల చంద్రుడిని మామ అని ముద్దుగా పిలుస్తాం.. కానీ నిప్పులు కక్కే సూర్యుడిని మాత్రం దగ్గరకు కూడా రానీయం.. భూమి మీద నేచర్ కు వీరిద్దరే మూలాధారం అయినా. ఒకరిని ఎంతో ప్రేమగా చూస్తూ.. మరొకరిని తలుచుకుంటేనే అమ్మో అంటాం.. ఇంక ఎండా కాలం వచ్చిందంటే.. ఎప్పుడు రాత్రి అవుతుందా..? చందమామ వెన్నెలలో ఆరుబయట నిద్ర పోదాం అని చూస్తుంటాం.. ఇప్పుడీ ఉపోద్ఘాతమంతా ఎందుకంటే..? సుర్రమనిపించే సూర్యడు ఫక్కున నవ్వడాని చెబుతున్నారు..? ఏంటీ.. అంతటి సీరియస్ మనిషిలోనూ హాస్య ప్రియత్వం ఉందా? ఏమో... ఎంతటి ఎర్ర సూరీడైనా అతడి వెనకేముందో చెప్పలేం కదా?
భూమిలాంటోడు కాదు.. అందుకే.. సూర్యుడు భూమి తరహా మనిషి కాదు. మన భూమిలాగా సూర్యుడికి ఘన ఉపరితలం లేదు. గురుత్వాకర్షణ, అయస్కాంత శక్తులతో కట్టుబడి ఉండే పదార్థంతో తయారైన సూర్యుడు.. అతి
తీవ్ర వేడి వాతావరణంతో ఉంటాడు. వేడి, పీడనం పెరిగి.. ఆ పదార్థాన్ని సూర్యుడి నుంచి దూరంగా నెట్టివేసినప్పుడు, అది గురుత్వాకర్షణ-అయస్కాంత క్షేత్రాలు చాలా బలహీనంగా ఉన్న స్థితికి చేరుతాయి. అలాంటి సూర్యుడు ఇప్పుడు నవ్వుతున్నాడంట.. ఈ తరహా నమూనా చిత్రాన్ని అమెరికా అంతరిక్ష పరిశోధనా కేంద్రం (నాసా) విడుదల చేసింది.
ఆ చీకటి మచ్చల్లో.. జీవకోటికి వెలుగు పంచడమే కానీ.. కనీసం తనకు కొన్ని కోట్ల మైళ్ల దగ్గరికి కూడా రానివ్వని సూర్యుడు.. నవ్వుతున్నట్లుండే ఫొటోను షేర్ చేసిన నాసా.. ఇంత మాత్రానికే సంబరం వద్దని ప్రమాదం పొంచి ఉందని హెచ్చరిస్తోంది. ఇక ఫొటోలో నవ్వుతున్నట్లు చూపిన అతినీలలోహిత కాంతిలో చూసినప్పుడు సూర్యునిపై ఉన్న ఈ చీకటి మచ్చలను కరోనల్ హోల్స్ అంటారు.
బలమైన సౌర గాలులు అంతరిక్షంలోకి వీచే ప్రాంతాలు ఇవి. ఈ ఫోటో అక్టోబర్ 26 నుండి సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఈ ఫోటో ఇంటర్నెట్‌లో వైరల్ కావడంతో, ప్రజలు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పుడు సూర్య బిస్కెట్ అని నిర్ధారణ అయింది అని ఓ వ్యక్తి ట్విట్టర్‌లో రాశాడు. సూర్యుడి ఈ చిత్రంతో పాటు, ఆ వ్యక్తి మినీ బిస్కెట్ ఫోటో కూడా షేర్ చేశాడు. చాలా మంది ఫోటోను కాస్త మార్చారు. ట్విట్టర్‌లో ఓ వ్యక్తి ఈ నవ్వుతున్న సూర్యుడికి సింహం రూపాన్ని ఇచ్చాడు.
ఫొటో ఒకటే.. భావాలు.. క్యాప్షన్లు వేరు చిన్నప్పుడు మనమంతా చంద్రుడి పై ఓ బామ్మ ఉందని.. వెన్నెల రాత్రుల్లో అది కనిపిస్తుందని పెద్ద వాళ్లు చెబుతుంటే విని సంబరపడిపోయేవారం. ముఖ్యంగా ఆ బామ్మ.. పేదరాశి పెద్దమ్మ అని చెబుతుంటే తెలుగువారికి బాగా కనెక్టయ్యేది. అందుకే చందమామ అంటే అందరికీ ప్రేమ. ఇక ఇప్పుడు నాసా ఉపగ్రహం ఈ వారం సూర్యుడు నవ్వుతున్న ఫొటోను విడుదల చేసి శీర్షిక కూడా పెట్టింది. ఇది చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఈ చిత్రాన్ని షేర్ చేస్తున్నప్పుడు, US స్పేస్ ఏజెన్సీ దీనిని స్మైలింగ్ సన్ అంటూ క్యాప్షన్ ఇచ్చింది.
సూర్యుడు నవ్వుతున్న ముఖంతో ఉన్న ఫోటో ఇప్పుడు నెట్టింట తెగ హల్‌చల్ చేస్తోంది. నాసాకు చెందిన సోలార్ డైనమిక్స్ అబ్జర్వేటరీ సూర్యుడిని ‘నవ్వుతూ’చూసిందని నాసా ఒక ట్వీట్‌లో పేర్కొంది. మరోవైపు, నాసా ఈ చిత్రాన్ని విడుదల చేసిన తర్వాత ఆన్‌లైన్‌లో మిశ్రమ స్పందనలు వచ్చాయి.. చాలా మంది దీనిని దెయ్యం ముసుగు అని పిలుస్తుండగా మరికొందరు దీనిని సింహం ముసుగు అంటున్నారు.. మరికొందరు మరో అడుగు ముందుకేసి ఈ చిత్రాన్ని పిల్లల ప్రదర్శన టెలిటబ్బీస్‌తో పోల్చారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.