Begin typing your search above and press return to search.

ఏపీలో ఒక రాజ‌కీయ ప్ర‌భంజ‌నం.. వైసీపీకి ఇబ్బందేనా..?

By:  Tupaki Desk   |   21 Jan 2023 11:30 PM GMT
ఏపీలో ఒక రాజ‌కీయ ప్ర‌భంజ‌నం.. వైసీపీకి ఇబ్బందేనా..?
X
త్వ‌ర‌లోనే ఏపీలో ఒక రాజ‌కీయ ప్ర‌భంజ‌నం తెర‌మీద‌కి రానుంది. ఒక‌వైపు టీడీపీ యువ నాయ‌కుడు, మాజీ మంత్రి నారా లోకేష్ యువ‌గ‌ళం, మ‌రోవైపు.. జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్ వారాహి యాత్ర‌లు ప్రారంభం కానుం డ‌డంతో రాజ‌కీయ వ‌ర్గాల్లో హై ఓల్టేజీ పెరిగిపోయింది. రెండు కూడా కీల‌క కార్య‌క్ర‌మాలే కావ‌డం.. ఒకే ద‌ఫా ప్రారంభం (కొద్దిపాటి తేడా వుండోచ్చు) కానుండ‌డంతో ఏపీలో పొలిటిక‌ల్ సెగ పీక్‌కు చేరింది.

ప్ర‌స్తుతం ఎక్క‌డ ఏ ఇద్ద‌రు క‌లిసినా.. ఈ రెండు కార్య‌క్ర‌మాల గురించిన చ‌ర్చే జ‌రుగుతోంది. వ‌చ్చే ఎన్ని క‌ల్లో ప్ర‌భావం చూప‌డంతోపాటు.. వైసీపీని గ‌ద్దె దింపాల‌నే ఏకైక ల‌క్ష్యంతో ముందుకు తీసుకువెళ్లాలని భావిస్తు న్న‌ ఈ రెండు కార్య‌క్ర‌మాల‌కు కూడా ప్ర‌జ‌ల్లో చాలా ఎక్స్‌పెక్టేష‌న్స్ క‌నిపిస్తున్నాయి.

ముఖ్యంగా ఇటు టీడీపీ అయితే..చాలానే ఆశ‌లు పెట్టుకుంది. అదేవిధంగా జ‌న‌సేన వ‌ర్గం కూడా ఈవారాహిపై మ‌రింత‌గా ఆకాంక్ష లు పెట్టుకుంది.

అయితే.. దీనికి సంబంధించి మ‌రోవైపు వైసీపీ కూడా చాలా కీన్‌గా ప‌రిశీల‌న చేస్తోంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఈ రెండు ప్రభావితం చూపించ‌నున్నాయా? అనే సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

అయిన‌ప్ప‌టికీ.. పార్టీకి ఇబ్బందిలేద‌ని.. సంక్షేమం త‌మ‌ను గెలిపిస్తుంద‌ని ధీమాతో ఉన్న‌ట్టు క‌నిపిస్తోంది. కానీ, అంత‌ర్గ‌తంగా ప‌రిశీల‌న చేస్తే.. ఈ రెండు యాత్ర‌ల‌పై నిశితంగానే పార్టీ వ‌ర్గాలు దృష్టిపెట్టాయి.

ఇప్ప‌టి వ‌ర‌కు చేస్తున్న సంక్షేమం.. మ‌రోవైపు, నొక్కుతున్న బ‌ట‌న్లు కూడా ఈ ప్ర‌చారంతో వృథాగా మార తాయా? అనే సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. అయిన‌ప్ప‌టికీ.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో గెలుపు గుర్రం ఎక్క‌డ‌మే ల‌క్ష్యంగా అది కూడా 175 స్థానాల్లో 175 స్థానాల‌ను గెలుచుకునేలా వ్యూహాత్మ‌కంగా అడుగులు వేయాల‌నే నిర్ణ‌యించుకుంది. ఈ క్ర‌మంలో ఎలా ముందుకు సాగుతారో చూడాలి.మొత్తానికి అటు యువ‌గ‌ళం, ఇటు యాత్ర రెండు కూడా హైప్ పెంచుతున్నాయి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.