Begin typing your search above and press return to search.
రాజ్యాంగంలో శ్రీరాముడి అసలు కాపీ.. అరుదైన చిత్రం
By: Tupaki Desk | 5 Aug 2020 11:30 AM GMTరామ మందిర నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం పూర్తయ్యింది. ఈ ప్రత్యేక దినం సందర్భంగా, శ్రీరాముడి అరుదైన చిత్రాన్ని సీనియర్ న్యాయవాదిగా ఉన్న కేంద్ర న్యాయ మంత్రి రవిశంకర్ ప్రసాద్ బుధవారం పంచుకున్నారు. స్వాతంత్ర్యం వచ్చిన కొత్తలో రాజ్యాంగంలో పొందుపరిచిన శ్రీరాముడి పత్రాన్ని పంచుకున్నారు.
"భారత రాజ్యాంగంలో పొందుపరిచిన శ్రీరాముడి అసలు చిత్రం ఇదీ. రావణుడిని ఓడించిన తరువాత శ్రీరాముడు, సీత మరియు లక్ష్మణుడు అయోధ్యకు తిరిగివచ్చే అందమైన చిత్రం ఇది. ఇది ప్రాథమిక హక్కులకు సంబంధించిన అధ్యాయం ప్రారంభంలో లభిస్తుంది. దీన్ని పంచుకోవాలని నేను భావించాను.. మీరందరూ చూడండి "అని మంత్రి అన్నారు. కేంద్ర మంత్రి రవిశంకర్ ఈ రోజును భారతదేశ ఆత్మగౌరవ దినంగా పేర్కొన్నారు.
బుధవారం, కేంద్ర మంత్రి రాజ్యాంగంలోని అసలు పత్రం నుండి శ్రీరాముడి ఫోటోను పంచుకున్నప్పుడు "రావణుడిని ఓడించిన తరువాత" అని నొక్కివక్కాణించారు. ఈ నేపథ్యంలోనే అయోధ్య కోసం బాబ్రీ మసీదు ఉదంతంలో ఒక వర్గంతో పోరాడి విజయం సాధించామన్న అర్థం వచ్చేలా కేంద్రమంత్రి రవిశంకర్ ట్వీట్ చేశారని దుమారం రేగింది.. ఆయన రాజకీయ సందేశం నిగూఢ అర్థం ఉందని రాజకీయ ప్రత్యర్థులు విమర్శిస్తున్నారు.