Begin typing your search above and press return to search.
పావురం కోసం రిస్క్ ఆపరేషన్.. చివరికీ కథ సుఖాంతం..!
By: Tupaki Desk | 13 Dec 2022 3:30 PM GMTఏదైనా పక్షి లేదా వన్య ప్రాణాలు ఆపదలో ఉంటే యానిమాల్ ప్రొటెక్షన్ అధికారులు క్షణాల్లో అక్కడి చేరుకొని వాటిని కాపాడుతుంటారు. ఇలాంటి సంఘటనలు విదేశాల్లో ఎక్కువగా కన్పిస్తుంటారు. వీటికి సంబంధించిన పలు వీడియోలు సైతం సోషల్ మీడియాలో తరుచూ వైరల్ గా మారుతుంటాయి.
ఉదాహరణకు ఒక బాతు తన పిల్లలతో రోడ్డు దాటుతుంటే వాహన దారులంతా తమ వెహికిల్స్ ఆపివేస్తారు. ఆ బాతు పిల్లలు రోడ్డు దాటే వరకు వేచి ఉంటారు. అవి దారి తప్పిపోయి మ్యాన్ హోల్ లాంటి వాటిలో ఇరుక్కుపోతే వెంటనే యానిమాల్ ప్రొటెక్షన్ ఫోర్స్ కు సమాచారం అందిస్తారు.
సంబంధిత అధికారులు సైతం వెంటనే సంఘటన ప్రాంతానికి చేరుకొని ఎంత రిస్క్ వాటిని వన్య ప్రాణాలు లేదా పెంపుడు జంతువులను కాపాడటం చేస్తుంటారు. ఇలాంటి ఘటనలు విదేశాల్లో ఎక్కువగా కన్పిస్తుంటాయి. ఇక మన దేశంలో ఇలాంటి ఘటనలు చాలా అరుదుగా కనిపిస్తుంటాయి.
అయితే పావురం లాంటి చిన్న ప్రాణిని రక్షించేందుకు హైదరాబాద్ కు చెందిన యానిమల్ వారియర్స్ కన్జర్వేషన్ సొసైటీ.. ట్రాన్స్ కో అధికారులు సంయుక్తంగా రిస్క్ ఆపరేషన్ చేశారు. కరెంటు తీగలకు ఇరుక్కుపోయిన పావురాన్ని కాపాడటం కోసం ఏకంగా మూడు జిల్లాలో విద్యుత్ సరఫరా నిలిపివేశారు. చివరికి పావురాన్ని కాపాడటంతో కథ సుఖాంతమైంది.
ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ లోని కేపీహెచ్బీ హైటెన్షన్ విద్యుత్ లైన్ కు పావురం చిక్కుకుపోయింది. పావురం కాలికి ఉన్న దారం తీగలకు చుట్టుకోవడం పావురం ఎటు కదలకుండా ఉండిపోయింది. దీనిని గుర్తించిన పలువురు స్థానికులు యానిమల్ వారియర్స్ కన్జర్వేషన్ సొసైటీకి సమాచారం అందించారు.
అయితే పావురం చిక్కుకున్నది 133 కేవీ విద్యుత్ లైన్ కావడంతో దానిని కాపాడే యత్నంలో సిబ్బంది ప్రాణాలను పోతాయని గుర్తించిన యానిమల్ వారియర్స్ అధికారులు ట్రాన్స్ కో ఛైర్మన్.. మేనేజింగ్ డైరెక్టర్ ప్రభాకర్ రావుతో సంప్రదింపులు చేశారు. దీంతో ఆయన సీనియర్ అధికారులతో సంప్రదింపులు చేసిన పావురం కోసం పది నిమిషాల పాటు మూడు జిల్లాలో పూర్తి కరెంటును నిలిపివేశారు.
ఈ మేరకు యానిమల్ వారియర్స్ సిబ్బంది బూమ్ లిప్ట్ తో పావురాన్ని కాపాడారు. కరెంటు నిలిపివేసింది పది నిమిషాలై అయినా దీనిని కాపాడే క్రమంలో అధికారులు ఆరు గంటల పాటు శ్రమించాల్సి వచ్చింది. మొత్తానికి పావురం ప్రాణాన్ని కాపాడిన ట్రాన్స్ కో అధికారులు.. యానిమల్ వారియర్స్ కన్జర్వేషన్ సొసైటీ సిబ్బందిపై ప్రతీఒక్కరూ ప్రశంసలు కురిపిస్తున్నారు.
తోటి మనిషికి యాక్సిడెంట్ అయితేనే పట్టించుకోని ఈ రోజుల్లో ఒక పావురం కోసం అధికారులు రిస్క్ తీసుకోవడం గొప్ప విషమమేనని పలువురు కామెంట్స్ చేస్తున్నారు. ఆ పావురానికి భూమి మీద ఇంకా నూకలు ఉండబట్టే అధికారులు సైతం తరలివచ్చి దాని ప్రాణాలను కాపాడని అంటున్నారు. ఏది ఏమైనా ఈ విషయంలో మాత్రం ట్రాన్స్ కో.. యానియల్ వారియర్స్ అధికారులు అభినందనలకు అర్హులే..!
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.