Begin typing your search above and press return to search.
సీఎంను కలవడానికి వచ్చి సూసైడ్
By: Tupaki Desk | 19 Aug 2017 4:24 AM GMTఏపీ సీఎం చంద్రబాబుకు తన కష్టాలు చెప్పుకోవాలని వచ్చి ఆ అవకాశం దొరక్కపోవడంతో నిరాశచెందిన ఓ వ్యక్తి సచివాలయం ప్రాంతంలోనే సూసైడ్ చేసుకున్నాడు.
నెల్లూరు జిల్లాకు చెందిన రాజగోపాల్ ఆర్ ఎంపీగా పనిచేసేవారు. కుటుంబ అవసరాల కోసం చేసిన అప్పులు ఎక్కువవడంతో ఆయన కష్టాల్లో కూరుకుపోయారు. దీంతో తన కష్టాలు చెప్పుకొంటే సీఎం సహాయం దొరుకుతుందన్న ఆశతో ఆయన వెలగపూడి సచివాలయానికి వచ్చాడు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి అపాయింట్ మెంట్ కోసం శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం వరకూ వెలగపూడిలోని సచివాలయం వద్ద వేచి చూసిన రాజగోపాల్ కు మొండి చేయి ఎదురైంది.
దీంతో తన కష్టాలు తీరడం కష్టమని భావించిన ఆయన వెంట తెచ్చుకున్న పురుగుల మందును అక్కడికక్కడే తాగేశారు. రాజగోపాల్ పురుగుల మందు తాగడం గమనించిన సచివాలయ సిబ్బంది ఆయన్ను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రాజగోపాల్ శనివారం తెల్లవారుజామున మృతి చెందారు. సీఎంను కలవడానికి వచ్చి సచివాలయంలోనే ఆత్మహత్య చేసుకోవడం అందరినీ కలచివేసింది.