Begin typing your search above and press return to search.

కొత్త యాపిల్ కోసం క్యూలో రోబోని నిలబెట్టాడు

By:  Tupaki Desk   |   25 Sep 2015 10:30 PM GMT
కొత్త యాపిల్ కోసం క్యూలో రోబోని నిలబెట్టాడు
X
యాపిల్ ఉత్పత్తులకు ఉండే క్రేజ్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక.. ఆ కంపెనీ కానీ తన కొత్త వెర్షన్ మొబైళ్లను విడుదల చేస్తుంటే టెక్నాలజీ ప్రేమికులు వాటిని సొంతం చేసుకోవటం కోసం గంటల తరబడి క్యూలో నిలుచోవటం మామూలే.

యాపిల్ విడుదల చేసే ఉత్పత్తుల్ని మొదటిరోజే ఉపయోగించాలని భావించే వారు ప్రాశ్చాత్య దేశాల్లో ఎక్కువే. ఇటీవల తన తాజా ఐఫోన్ 6ఎస్.. 6ఎస్ ప్లస్ ఆవిష్కరించింది. తాజాగా వాటిని మార్కెట్ లోకి విడుదల చేశారు. వీటిని కొనుగోలు చేసేందుకు యాపిల్ ప్రియులు బారులు తీరారు. ఈ సందర్భంగా ఆస్ట్రేలియా రాజధాని సిడ్నీలో ఒక విచిత్రం చోటు చేసుకుంది.

యాపిల్ సరికొత్త ఫోన్ ను చేజిక్కించుకునేందుకు వచ్చిన వారిలో తొలి కస్టమర్ గా ఒక రోబోకు అవకాశం లభించింది. ఇదెలా అంటే.. సిడ్నీకి చెందిన మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ లూసీ కెల్లీకి కొత్త గ్యాడ్జెట్ లు అంటే ఇష్టం. అందులోకి యాపిల్ ఉత్పత్తులు విడుదల అవుతున్నాయంటే వాటిని చేజిక్కించుకునే వరకూ నిద్రపోరు. అదే రీతిలో.. తాజాగా యాపిల్ కొత్త ఫోన్ కొనాలని భావించినా.. రెండు రోజుల పాటు క్యూలో నిలుచునే తీరిక లేకపోవటంతో వినూత్నంగా ఆలోచించి కొత్త ఫోన్ కొనే బాధ్యతను తన రోబోకు అప్పగించారు.

దీంతో.. తన స్థానంలో తన రోబోను పంపిన కెల్లీ మొదటి ఫోన్ ను చేజిక్కించుకున్నాడు. ఇలా.. సిడ్నీలో యాపిల్ ఫోన్ కొత్త ఫోన్ మొదటి కస్టమర్ గా రోబో అయ్యింది. భవిష్యత్తు ఎలా ఉంటుందనటానికి ఈ ఘటన ఓ ఉదాహరణ ఏమో.