Begin typing your search above and press return to search.

స్కూల్లో ముగ్గురు పిల్లలు.. బడ్జెట్ 12 లక్షలు!!

By:  Tupaki Desk   |   17 Jun 2020 12:36 PM GMT
స్కూల్లో ముగ్గురు పిల్లలు.. బడ్జెట్ 12 లక్షలు!!
X
ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు, సదుపాయాల కల్పన ప్రధాన లక్ష్యంగా సీఎం వైఎస్ జగన్ ‘నాడు-నేడు’ కార్యక్రమాన్ని ప్రారంభించాడు. ఇందులో భాగంగా పాఠశాలలను అభివృద్ధి పరిచి పేద పిల్లలకు ఉచితంగా నాణ్యమైన విద్యను అందించేందుకు నడుం బిగించాడు.

ఏపీలో ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేయాలని సీఎం జగన్ సంకల్పించి ముందుకెళ్తున్నారు. పెద్ద ఎత్తున నిధులు కూడా ఖర్చు చేస్తున్నారు.. కానీ ఎంత అభివృద్ధి చేసినా ప్రభుత్వం పాఠశాలలకు పిల్లలను తల్లిదండ్రులు పంపించడం లేదట.. ఎందుకు అంటే ‘అమ్మఒడి విద్యా దీవెన’ పథకం ప్రైవేటు స్కూల్స్ కు కూడా వర్తిస్తుండడం.. నగదు బదిలీ ప్రైవేట్ స్కూల్ పిల్లలకు కూడా పడుతుండడంతో తల్లిదండ్రులు గవర్నమెంట్ పాఠశాలలకు పిల్లలను పంపడం లేదట.. ఈ నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లల సంఖ్య క్రమంగా తగ్గుతోంది.

ఇలాంటి పరిస్థితుల్లో ప్రకాశం జిల్లాలోని గిద్దలూరు నియోజకవర్గంలో ఒక స్కూల్లో కేవలం ముగ్గురు పిల్లలు మాత్రమే ఉన్నారు. కానీ ఆ స్కూల్ కు అక్కడ ప్రజాప్రతినిధులు ఒత్తిడి చేసి మరీ ముగ్గురు ఉండే స్కూల్ కు రూ.12 లక్షల నిధులు మంజూరు చేయించుకున్నారు. ఈ 12 లక్షల నిధుల్లో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతోందని స్థానికులంతా చర్చించుకుంటున్నారు. పిల్లలు లేని స్కూళ్లకు నిధుల విషయంలో ప్రభుత్వం నజర్ పెట్టి ఈ నిధులు స్వాహా కాకుండా చూడాలని వారు కోరుతున్నారు.