Begin typing your search above and press return to search.
ఆస్తి కోసం కన్న కొడుకు చేసిన నిర్వాకమిదీ
By: Tupaki Desk | 5 Jun 2019 7:27 AM GMTఆస్తి కోసం కన్నతండ్రిని నడివీధుల్లో కొట్టిన కొడుకు ఒకవైపు.. సొంత మామ అని కూడా చూడకుండా కళ్లలో కారం కొట్టిన కోడలు ఓ వైపు.. ఇలా మానవత్వం నడిబజారులో మంటగలిసింది. సభ్యసమాజం తలదించుకున్న ఘటన చోటుచేసుకుంది.
తిరుపతి నగరంలోని అనంతవీధిలో మునికృష్ణయ్య (80) - కృష్ణవేణి దంపతులు నివసిస్తున్నారు. వీరికి విజయభాస్కర్ - తులసీరామ్ కు కొడుకులు. చాలా ఏళ్ల క్రితం అప్పు చేసి మునికృష్ణయ్య ఇంటిని కట్టుకున్నాడు. అప్పుల విషయమై కొడుకులతో తండ్రికి తగాదాలు వచ్చాయి. దీంతో చిన్న కుమారుడు తులసీరామ్ వేరు కాపురం పెట్టుకొని వెళ్లిపోయాడు. కొన్నాళ్లకు అప్పు గుదిబండగా మారడంతో పెద్ద కుమారుడు విజయ్ భాస్కర్ సైతం భార్యతో కలిసి వేరు కాపురం పెట్టాడు. తల్లిదండ్రుల పోషనను పట్టించుకోలేదు. దీంతో అనాథగా మారిన తల్లిదండ్రులను చిన్న కొడుకు తులసీరామ్ చేరదీశాడు. అప్పు తీర్చుకుంటూ వచ్చాడు. అప్పు దగ్గరపడడంతో పెద్ద కుమారుడు మళ్లీ రీఎంట్రీ ఇచ్చాడు. తల్లి పేరిట ఉన్న ఆ ఇంటిని తనకు రాసివ్వాలని హింసించడం మొదలు పెట్టాడు. ఈ క్రమంలోనే మంగళవారం తండ్రీ కొడుకులు - కోడలు గొడవ పడ్డారు.
తండ్రిపై ఆగ్రహం వ్యక్తం చేసిన విజయ్ భాస్కర్ దాడి చేయగా.. కోడలు మామ కళ్లల్లో కారం కొట్టింది. రోడ్డుపైకి వృద్ధుడు వచ్చి మొరపెట్టుకున్నా ఆ కసాయి కొడుకు - కోడలు వదలలేదు. కన్నతండ్రినే కొడుతున్న వైనం స్తానికులను కలిచివేసింది. చుట్టుపక్కల వారు మునికృష్ణయ్యను రక్షించారు. పోలీసులకు సమాచారం అందించి మునికృష్ణయ్యను ఆసుపత్రికి తరలించారు.
మునికృష్ణయ్య ఫిర్యాదు మేరకు కొడుకు విజయభాస్కర్ - కోడలు నీరజ - నీరజ తమ్ముడు వంశీకృష్ణపై కేసు నమోదు చేశారు. దాడి దృశ్యాలు కొందరు ఫొటోలు - వీడియోలు తీసి సోషల్ మీడియాలో విడుదల చేయడంతో వైరల్ గా మారింది.